Sunday, March 22, 2026

బాలీవుడ్ హీరోయిన్‌కు పాక్ క్రికెటర్‌కు మధ్య ప్రేమ.. 40 ఏళ్ల క్రితమే పెళ్లి వరకు..

ప్రేమకు దూరాలు ఉండవు. సరిహద్దులు ఉండవు. ఎక్కడున్న వారి మనసుల్లోనైనా ప్రేమ పుట్టోచ్చు. ఎవరి మధ్యయినా ప్రేమ చిగురించవచ్చు. కొన్నిసార్లు దేశాల మధ్య శాశ్వత శత్రుత్వాలను కూడా పట్టించుకోదు. ఇది భారత్-పాక్‌ల మధ్య కూడా ఇలాంటి ప్రేమ వ్యవహారాలు కూడా నడిచాయి. ఇక భారత్-పాక్‌ల మధ్య సినిమా-క్రికెట్ బంధం కూడా చాలా బలంగా ఉంటుంది. ఆ క్రమంలోనే కొన్ని ప్రేమలు కూడా ఈ రెండు రంగాల్లో చిగురించాయి. అందులో భాగంగానే పాక్ మాజీ క్రికెటర్, ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, బాలీవుడ్‌ అలనాటి ముద్దుగుమ్మ రేఖల మధ్య ఈ ప్రేమ పుట్టిందట. వీరి ప్రేమ పెళ్లి దాకా వెళ్లిందట. ప్రస్తుతం వీరిద్దరి ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఓ స్టోరీ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

పాకిస్తాన్ క్రికెట్లో ఒకప్పుడు ఇమ్రాన్‌ ఖాన్‌ పెద్ద లవర్ బాయ్. అతడి చుట్టూ ఎక్కువగా అందమైన అమ్మాయిలు ఉండేవారని ఇప్పటికీ టాక్ నడుస్తుంది. అప్పట్లో భారత్‌, పాక్‌ ఎక్కువగా ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీసులు జరుగుతుంటే భారత అమ్మాయిలు కూడా ఇమ్రాన్‌ కోసం తెగ ఎగబడేవారట. అలాగే పాక్‌ క్రికెటర్లు కూడా బాలీవుడ్‌ హీరోయిన్లంటే తరచూ కలుస్తుండేవారు. ఈ క్రమంలోనే ఇమ్రాన్‌, రేఖ మధ్య కూడా ప్రేమ పుట్టిందట. వారి ప్రేమ దాదాపుగా పెళ్లి చేసుకునే వరకు వెళ్లిందట. బీచులు, పార్కులు ఇలా రెండింటిలో వారు తెగ చట్టాపట్టాలేసుకుని తిరిగేవారట. అయితే చివరికి ఏమయిందో ఏమో వారి పెళ్లి మాత్రం జరగలేదు.

కాగా.. సినీ తారలతో డేటింగ్‌‌పై ఇమ్రాన్ అభిప్రాయం మాత్రం విచిత్రంగా ఉంది. అప్పట్లోనే దీనికి సంబంధించి ఇమ్రాన్ చెప్పినట్లు ఓ అభిప్రాయం కూడా అప్పట్లో ప్రచురితమైంది. అందులో ఇమ్రాన్.. నటీమణులతో సహచర్యం కొన్నాళ్లే బాగుంటుందని, కొంత వరకు వారితో సాంగత్యాన్ని తాను ఆస్వాదించేవాడినని, ఆ తర్వాత జీవితంలో ముందుకెళ్లిపోయివాడేనని ఇమ్రాన్ చెప్పాడు. అయితే తన జీవితంలో ఎప్పుడూ నటిని పెళ్లి చేసుకోవాలని మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదంటూ ఇమ్రాన్‌ చెప్పాడు. మరి రేఖ అతడిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రేమించిందో.. లేదో కూడా ఆమె ఎప్పుడూ చెప్పలేదు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -