Monday, March 23, 2026

బిజీ హీరోయిన్‌గా మారుతోన్న దివ్యాంశ కౌశిక్

శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. అన్షు పాత్రలో మొదటి సినిమాతోనే కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఈ చిత్రానికి అద్భుతమైన రివ్యూలు రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. దివ్యాంశ కౌశిక్ తన నటనా నైపుణ్యానికి చాలా ప్రశంసలు అందుకుంది. తరువాత ఆమె సిద్దార్థ్ నటించిన టక్కర్ సినిమాతో తమిళంలో అరంగేట్రం చేసింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మళ్ళీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో తెలుగు సినిమాకు రీ ఎంట్రీ ఇచ్చింది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం నుండి ఇదివరకే విడుదలైన ‘సొట్టల బుగ్గల్లో’ పాటలో రవితేజ సరసన కనిపించి మరోసారి కుర్రకారును ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతినిండా అవకాశాలతో ఈ ఇయర్ కేలండర్‌ను తన కాల్షీట్స్‌తో నింపేసింది.

కేవలం తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా తమిళ చిత్రాల అవకాశాలు కూడా దివ్యాంశను వెతుక్కుంటూ వస్తున్నాయి. అందం, అభినయం సమపాళ్లలో ఉన్న దివ్యాంశ తన స్పీడ్ పెంచడం అభిమానులకు ఆనందం కలిగించే విషయం. రవితేజ సరసన దివ్యాంశ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి మంచి ఫలితాలు వస్తే ఈమెకు వరుస అవకాశాలు రావడం ఖాయం.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -