Monday, March 23, 2026

టెస్టు మొదలు కాకుండానే రెండో ర్యాంకు పట్టేసిన జడ్డూ

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ మొదలు కూడా కాకముందే టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐసీసీ ర్యాంకుల్లో దూసుకొచ్చాడు. ఏకంగా రెండో ర్యాంకు పట్టేశాడు. ఈ మేరకు ఐసీసీ గురువారం ప్రకటించిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ ద్వారా ఇది వెల్లడైంది. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా(386 రేటింగ్‌ పాయింట్లు) 2వ ర్యాంకుకు చేరినట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ క్రమంలో అతను ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌(385 పాయింట్లు)ను వెనక్కి నెట్టాడు. టెస్ట్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో వెస్టిండీస్‌ క్రికెటర్‌ జేసన్‌ హోల్డర్‌ 423 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆశ్విన్‌ 4వ స్థానంలో, బంగ్లా ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్ హసన్ 5వ స్థానంలో నిలిచారు. జడేజా రెండో స్థానానికి చేరడంతో బెన్ స్టోక్స్ 3వ ర్యాంకుకు పడిపోయాడు.

ఇక ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నుంచి ముగ్గురు బ్యాట్స్‌మన్ టాప్‌-10లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 814 రేటింగ్‌ పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుండగా, రిషబ్‌ పంత్‌(747), రోహిత్‌ శర్మ(747) వరుసగా 6, 7 ర్యాంకుల్లో నిలిచారు. ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా, ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌ 2వ ర్యాంకు, మార్నస్‌ లబూషేన్‌ 3వ ర్యాంకుల్లో ఉండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ 4వ స్థానాల్లో ఉన్నారు.

అలాగే బౌలర్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌(908) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 850 పాయింట్లతో 2వ ర్యాంకులో ఉన్నాడు. కాగా.. న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ మూడో ర్యాంకుకు ఎగబాకాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో సహా మొత్తం 7 వికెట్లు పడగొట్టిన సౌథీ.. 838 రేటింగ్‌ పాయింట్లతో 3 స్థానాలు మెరుగుపరచుకుని 3వ ర్యాంక్‌కు చేరాడు. ఇక నాలుగో స్థానంలో కివీస్‌కు చెందిన నీల్‌ వాగ్నర్‌ 816 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాడు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -