Sunday, March 22, 2026

హార్స్ రైడింగ్‌లో జడ్డూ బిజీబీజీ.. వీడియో వైరల్

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు గుర్రపు స్వారీ అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పక్కర్లేదు. జడేజా ఇండి నిండా గుర్రాలతో నిండి ఉంటుంది. వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఖాళీ దొరికినప్పుడల్లా సరదాగా వాటిపై సవారీ చేస్తూ ఉంటాడు. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే బయటకొచ్చింది. జడ్డూ గుర్రపు సవారీ చేస్తూ వెళుతున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఫామ్‌లో హార్స్ రైడింగ్ చేస్తున్న వీడియోను జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అభిమానులతో ఈ వీడియోను పంచుకుంటూ `నా రైడింగ్‌ స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకుంటున్నా` అని కామెంట్ చేశాడు. దీనిపై నెటిజన్లు కూడా విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. హార్స్ రైడింగ్ చేస్తున్న షేర్(సింహం)లా ఉన్నావంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘గుర్రంపై చిరుత ఏం చేస్తోంది..?’ అంటూ మరో నెటిజన్ చమత్కరించాడు.

కాగా.. బ్యాటింగ్, బౌలింగ్‌లోనే కాకుండా మైదానంలో చిరుతలా కదులుతూ ప్రపంచస్థాయి ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు జడేజా. టీమిండియాకు కీలక ఆటగాడిగా ఎదిగిన జడేజా ఫిట్‌నెస్‌ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన జడ్డూ ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. అక్కడ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కివీస్‌తో, ఆ తర్వాత టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడే జట్లలో జడ్డూకు స్థానం లభించింది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -