రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నైకుఒంటి చేత్తో గెలుపునందించాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండింటిలోనూ సూపర్ పెర్ఫార్మెన్స్‌తో ఆర్సీబీ నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. దీంతో మ్యాచ్ అనంతరం జడేజాపై ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫాఫ్ డూ ప్లెసిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. జడేజా ఇన్నింగ్స్‌పై సహచర ఆటగాడు డుప్లెసిస్ మాట్లాడుతూ.. అతడి ఇన్నింగ్స్‌తో మ్యాచ్ పూర్తిగా తమవైపు తిరిగిందన్నాడు.
జడేజా నుంచి అలాంటి ఆటను తాము ఊహించామని, అయినా అతడు అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని ఫాఫ్ అన్నాడు. ఈ సీజన్‌లో జడేజా చాలా బాగా ఆడుతున్నాడని, అతని బ్యాటింగ్ బాగా మెరుగుపడిందని కొనియాడాడు. చివరి ఓవర్‌లో జడేజా కొట్టిన షాట్లు ఏదో అనుకోకుండా ఆడినవి కాదని, ప్రాక్టీస్ సెషన్‌లో జడేజా తీవ్రంగా కష్టపడ్డాడని, ప్రధానంగా సిక్సర్లు కొట్టడంపైనే దృష్టి సారించాడని, దాని ఫలితమే మ్యాచ్‌లో కనపడిందని ఫాఫ్ చెప్పుకొచ్చాడు. జడేజా ఆడిన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ తమ వైపు మలుపు తిరిగిందని, తాము 160-165 స్కోరు చేస్తామనకున్నామని, స్లో వికెట్‌పై అది సరిపోతుందనుకున్నామని, కానీ జడేజా విజృంభణతో మరో 30-35 పరుగులు అతనంగా రావడంతో మ్యాచ్ గతి మారిపోయిందని అన్నాడు.
అంతేకాకుండా ఇక మీదట జడేజా విషయంలో జాగ్రత్తగా ఉండాలని తమ జాతీయ జట్టుకు సూచిస్తానని చమత్కరించాడు. తమ దేశ క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా.. టీమిండియాతో ఆడుతున్నప్పుడు కూడా జడేజా గురించి ఆలోచిస్తామని డుప్లెసిస్ పేర్కొన్నాడు. భారత్ జట్టులో జడేజా అత్యంత ప్రమాదకరమైన ఫీల్డర్ అనే విషయాన్ని భారత్‌తో మ్యాచ్‌లు ఉన్న ప్రతీ సందర్భంలోనూ గుర్తుంచుకుంటానని అన్నాడు. ‘జడేజా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచిస్తా. మా జట్టు కూడా జడేజాను ఇకమీదట సీరియస్‌గా తీసుకుంటుంద’ని ఫాఫ్ చెప్పుకొచ్చాడు.
‘ముఖ్యంగా బౌండరీ లైన్ వద్ద జడేజా ఉన్నాడంటే కచ్చితంగా రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించడం. ఎందుకంటే.. అతడు బంతిని అందుకున్న రెప్పపాటు కాలంలో అది నేరుగా వికెట్ల దగ్గరికి చే9రుతుంది. అది మాకు ఒక మిరాకిల్‌లా అనిపిస్తుంది. అతడి చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది’ అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.