టెస్ట్ ఛాంపియన్ షిప్ అంటే.. సాంప్రదాయ క్రికెట్‌లో అగ్ర స్థానం ఎవరిదో నిర్ణయించే టోర్నీ. రెండేళ్ల కాల పరిమితితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రవేశపెట్టింది. ఇది 2019లో మొదలై 2021లో ముగుస్తోంది. ఈ రెండేళ్లలో విజయాల శాతం ఆధారంగా భారత్, న్యూజిలాండ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. వచ్చే నెల 18-22 మధ్య ఇంగ్లండ్‌లోని సౌంతాప్టన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఇదే క్రమంలో ఇంత ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్ కావడంతో కచ్చితమైన రిజల్ట్ వచ్చేలా ఐసీసీ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఓ వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
టెస్ట్ మ్యాచ్ అంటే ఇన్నాళ్లూ మనకు 5 రోజులు ఆడతారనే తెలుసు. ఇంగ్లీష్ కౌంటీల్లో అయితే 4 రోజుల టెస్ట్ మ్యాచ్‌లు కూడా నిర్వహిస్తారు. అయితే ప్రపంచం టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నేపథ్యంలో మ్యాచ్ రిజల్ట్ కోసం అవసరమైతే 6 రోజుల టెస్ట్ మ్యాచ్ నిర్వహించేందుకు కూడా ఐసీసీ రెడీ అవుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభంలో ఫైనల్‌కు అర్థత సాధించడానికి పాయింట్ల ఆధారంగా నిర్ణయిస్తామని ఐసీసీ పేర్కొంది. అయితే ఆ తరువాత ఈ విధానాన్ని మార్చి విజయాల శాతం ద్వారా జట్ల అర్హతను నిర్ణయించింది. తాజాగా ఫైనల్ మ్యాచ్‌ను 6 రోజుల మ్యాచ్‌గా మార్చాలని భావిస్తుంది. 5 రోజుల ఆట సాధ్యపడిన తర్వాత కూడా మ్యాచ్ డ్రాగా ముగిస్తే, ఫలితం కోసం 6వ రోజు కూడా కొనసాగించాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పోటీని డ్రా ముగిచడానికి ఐసీసీ ఇష్టపడడం లేదు. అందువల్లనే ఐసీసీ ఈ మేరకు ఆలోచనే చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, రెండేళ్ల కాలపరిమితితో ప్రవేశ పెట్టిన ఈ మెగా టోర్నీ 2019లో మొదలై 2021తో ముగుస్తుంది. టెస్ట్ విభాగంలో ఇదే మొట్టమొదటి వరల్డ్ సిరీస్ కావడంతో దీనిపై అభిమానుల తెగ ఆసక్తిగా ఉన్నారు. అందులో భారత్ ఫైనల్ చేరడంతో ఈ మ్యాచ్ కోసం దేశీయ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా.. జూన్ 8న సౌతాంఫ్టన్ వేదికగా భారత్-కివీస్ మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది.