Friday, November 1, 2024

మళ్లీ అగ్రపీఠం సాధించిన టీమిండియా.. పడిపోయిన కివీస్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్ మ్యాచ్ ఆడడానికి ముందే టీమిండియాకు ఓ తీపికబురందింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది. అలాగే కివీస్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఫైనల్‌కు ముందు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయింది. జూన్‌లో ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐసీసీ గురువారం టాప్‌ 10 టెస్ట్ జట్లను ప్రకటించింది. మే 2020 నుంచి మే 2021 వరకు జరిగిన మ్యాచ్‌ల ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చినట్లు ఐసీసీ స్పష్టం చేసింది.ఆసీస్‌, ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లను గెలుచుకున్న టీమిండియా తన పాయింట్లలో ఓ పాయింట్ పెంచుకుంది. దీంతో 121 పాయింట్లతో టాప్‌కు చేరింది. అలాగే అదే సమయంలో 2 పాయింట్లు సాధించిన న్యూజిలాండ్‌ 120 పాయింట్లతో రెండో స్థానానికే పరిమితమైపోయింది. ఇక మూడో స్థానంలో ఇంగ్లండ్‌ 109 పాయింట్లతో, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా 108 పాయింట్లతో ఉన్నాయి.

ఇక దక్షిణాఫ్రికా, జింబాబ్వేలపై టెస్టు సిరీస్‌లను నెగ్గిన పాకిస్తాన్‌ 84 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్‌పై సిరీస్ గెలిచి లంకతో డ్రా చేసుకున్న వెస్టిండీస్‌ కూడా 84 పాయింట్లతోనే ఉన్నా దశాంశాల తేడాతో 6వ స్థానంలో ఉంది. ఇక 7వ స్థానంలో దక్షిణాఫ్రికా టెస్ట్ ర్యాంకింగ్స్ చరిత్రలోనే తొలిసారిగా అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఇక శ్రీలంక, బంగ్లాదేశ్‌, జింబాబ్వేలు వరుసగా 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి.

కాగా సౌతాంప్టన్‌ వేదికగా టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌ 18 నుంచి 22 వరకు జరగనుంది. ఇక బ్యాటింగ్‌ విభాగంలో కేన్‌ విలియమ్సన్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. టీమిండియా నుంచి కోహ్లీ 5వ స్థానంలో ఉండగా.. రిషబ్‌ పంత్‌, రోహిత్‌ శర్మలు సంయుక్తంగా ఆరో స్థానాల్లో నిలిచారు. బౌలింగ్‌ విభాగంలో తొలి స్థానంలో ప్యాట్ కమిన్స్‌(908 పాయింట్లు), రెండో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌(850 పాయింట్లతో), మూడో స్థానంలో నీల్‌ వాగ్నర్‌(825 పాయింట్లు) ఉన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x