Friday, November 1, 2024

కంగన వర్సెస్ ఇర్ఫాన్ పఠాన్.. ఇన్‌స్టాలో వార్

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆమె ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ కారణంగా సోషల్ మీడియా సంస్థ ట్విటర్ ఆమెను శాశ్వతంగా ఆమె బ్యాన్ చేసింది. అయితే ఆమె తాజాగా మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రాంలో కొన్ని కామెంట్స్ చేసింది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంపై ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. దీనిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించడంతో ఇద్దరి మధ్య హీటెడ్ డిబేట్ నడిచింది.

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పాలస్తీనాలో జరుగుతున్న హింస గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. ‘నేను పాలస్తీనాకు మద్దతు తెలపడం లేదు. పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న విధ్వంసకాండను తప్పు బడుతున్నా. మీకు కొంచెం మానవత్వం కూడా ఉంటే, పాలస్తీనాలో ఏమి జరుగుతుందో తెలుస్తుంది. మీరు మద్దతు ఇవ్వండి” అంటూ పోస్ట్ చేశాడు. అయితే పఠాన్‌ పాలస్తీన్‌కు మద్దతు ఇవ్వడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ మండిపడింది. పఠాన్‌ను టార్గెట్‌ చేస్తూ..”ఇర్ఫాన్ పఠాన్‌కు ఇతర దేశాలపై అంత ప్రేమ ఉంది. కానీ తన సొంత దేశంలో బెంగాల్‌‌లో జరుగుతున్న హింసపై పోస్ట్ చేయలేకపోయాడు’ అంటూ కంగన విమర్శలు చేసింది.

కంగన ఇచ్చిన ఈ రిప్లైపై ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగా బదులిచ్చాడు. ‘నా ట్వీట్లన్నీ మానవత్వం లేదా దేశస్థుల కోసమే. ఇందులో దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి అభిప్రాయం ఉంది. మరోవైపు కంగనా మాత్రం ఇలాంటి వివాదాస్పద పోస్ట్‌లు చేస్తున్నారు..’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. అంతేకాదు తన ఖాతాను తానే బ్లాక్‌ చేసుకుందంటూ చురకలు కూడా అంటించాడు. దీనివల్ల ఆమె ప్రవర్తన తనకు నచ్చలేదం’టూ రాసుకొచ్చాడు.

కాగా.. ఇప్పుడు వీరిద్దరి మధ్య వివాదం సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతోంది. మరోవైపు ఇర్ఫాన్ ఫ్యాన్స్ కూడా కంగనా వ్యవహారంపై మండిపడుతున్నారు. మానవత్వంతో పెడుతున్న ట్వీట్లను కూడా ఆమె వక్రీకరించడం సరికాదంటూ కామెంట్లు చేస్తున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x