Sunday, March 22, 2026

గబ్బర్‌కే కెప్టెన్సీ..? శ్రీలంక పర్యటనలో అతడే..

ముంబై: టీమిండియా సెకండ్ టీంకు కెప్టెన్‌గా శిఖర్ ధవన్‌ ఎంపికకానున్నాడా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కెరీర్లో తొలిసారిగా టీమిండియాకు గబ్బర్‌ కెప్టెన్సీ వహించనున్నాడు. ఇప్పటి వరకు కొన్ని మ్యాచ్‌ల్లో వైస్ కెప్టెన్‌గా చేసిన ధవన్.. కెరీర్‌లో తొలిసారి భారత జట్టుకు నాయకత్వం వహించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

వచ్చే నెలలో శ్రీలంకతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం ధవన్‌ను భారత జట్టు కెప్టెన్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించిందట. అయితే, ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఇంకా బయటకు రాలేదు.

కాగా.. శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. జులై 13న భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే జరుగనుండగా.. జూన్‌ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే‌ జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌ నిమిత్తం భారత చీఫ్ కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించబోతున్నాడు. మ్యాచ్‌లన్నీ కొలంబో వేదికగా జరగనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

లంక పర్యటనకు లిమిటెడ్‌ ఓవర్స్‌ స్పెషలిస్ట్‌లతో కూడిన భారత బీ జట్టుని సెలెక్టర్లు అతి త్వరలో ఎంపిక చేయనున్నారు. ఇందులో శిఖర్ ధవన్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, రాహుల్ చాహర్, రాహుల్ తెవాటియా తదితరులు ఉండే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే టీమిండియా ప్రధాన జట్టు కోహ్లీ నేతృత్వంలో ఇప్పటికే ఇంగ్లండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 18 నుంచి 22 వరకు భారత రెగ్యులర్‌ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ ఆడనుంది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -