Sunday, March 22, 2026

మాట మార్చిన ద్రవిడ్.. అక్కడ అందరికీ అవకాశం లేదట!

టీమిండియా రెండో జట్టుకు కోచ్‌గా ఎంపికైన రాహుల్ ద్రవిడ్ మాట మార్చాడు. జట్టులో అందరికీ చోటు దక్కుతుందని ఇటీవల చెప్పిన ద్రవిడ్.. ఇప్పుడు ఆ ఆలోచన నుంచి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

‘నేను కోచ్‌గా ఉన్న అండర్‌ 19 జట్టు నుంచి ఈ టోర్నీకి ఎంపికైన ప్రతి ఆటగాడికి అవకాశం కల్పించాను. శ్రీలంక పర్యటనలో కూడా ప్రతీ ఆటగాడికి అవకాశం కల్పిస్తాను’ అని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భారత దిగ్గజ ఆటగాడు, జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్ చెప్పాడు.

జట్టుకు ఎంపికై బెంచ్‌కే పరిమితం కావడం చాలా బాధిస్తుందని, ఆ బాధలను తాను కూడా అనుభవించానని కొద్ది రోజుల క్రితమే ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

కానీ తాజాగా అది సాధ్యపడదని, సెలెక్షన్ కమిటీనే తుది జట్టును నిర్ణయిస్తుందని మాట దాటవేశాడు. కేవలం 6 మ్యాచ్‌ల(మూడు వన్డేలు, మూడు టీ20లు) లంక పర్యటనలో అందరికీ అవకాశం వస్తుందనుకోవడం సరికాదని, ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించాడు.

కాగా.. జులై 13 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో శిఖర్ ధవన్ నేతృత్వంలోని భారత జట్టు.. శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న  జరుగనుండగా..జూన్‌ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే‌ జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20, జులై 23 రెండో టీ20, 25న మూడో టీ20 మ్యాచ్‌ జరుగనుంది.

భారత జట్టు: శిఖర్‌ ధవన్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్ (వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, హార్దిక్ పాండ్యా, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్, మనీష్‌ పాండే, నితీష్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌, యుజ్వేంద్ర చహల్‌, రాహుల్‌ చాహర్‌, కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, దీపక్‌ చహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -