Monday, March 23, 2026

కొత్త ఖిలాడీ రేవంత్.. తేనీటి విందుతో మంతనాలు మొదలు..!?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా యువ నేత రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే సోమవారం స్థానిక పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి టీ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి స్థానిక నేతలను, కార్యకర్తలను ఆయన ఆహ్వానించారు.

ఈ క్రమంలోనే రేవంత్ మాట్లాడుతూ.. పార్టీని నడిపించడంలో అందరి సహకారం కోరుకుంటున్నానని, ప్రతి ఒక్కరి సలహాలతోనే పనిచేస్తానని హామీ ఇచ్చారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైనందుకు రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా.. జులై 7న గాంధీభవన్‌లో పీసీసీ బాధ్యతలు చేపట్టనున్నట్లు రేవంత్ ఆదివారం వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు హైదరాబాద్‌ సమీప జిల్లాల కార్యకర్తలను మాత్రమే ఆహ్వానించాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే గాంధీ భవన్ కు చేరుకునే ముందు ముందుగా రేవంత్.. పెద్దమ్మ గుడిలో పూజలు చేహనున్నారు.

ఆ తర్వాత అక్కడ నుంచి ర్యాలీగా వెళ్లి నాంపల్లి దర్గాలో చాదర్ సమర్పిస్తారు. అనంతరం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -