తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రంలో పార్టీ సారథ్య పగ్గాలను రేవంత్‌రెడ్డికి అప్పగించదాంతో అతడి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
పీసీసీ అధ్యక్ష పీఠం కోసం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించినప్పటికీ ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న రేవంత్‌నే అధిష్ఠానం అధ్యక్షుడిగా ఖరారు చేసింది.
పీసీసీ చీఫ్‌తో పాటు ఐదుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు, 10 మంది సీనియర్ ఉపాధ్యక్షులతో పాటు ప్రచార కమిటీ ఛైర్మన్‌ను కూడా అధిష్టానం తాజాగా నియమించింది.
అలాగే, ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ్ కుమార్ సేవలను ప్రశంసిస్తూ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.
ఇదిలా ఉంటే తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాకాగాంధీ, మాణికం ఠాగూర్‌కు రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
వర్కింగ్ ప్రెసిడెంట్లుగా.. అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, మహేశ్ కుమార్‌గౌడ్‌లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.
అలాగే పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మధుయాష్కీని నియమించింది. ప్రచారకమిటీ కన్వీనర్‌గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యాచరణ అమలు కమిటీ చైర్మన్‌గా మహేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు.
సీనియర్ ఉపాధ్యక్షులుగా సంభాని చంద్రశేఖర్, దామోదర్‌రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేష్ షెట్కార్, వేం నరేందర్‌రెడ్డి, రమేష్ ముదిరాజ్, గోపీశెట్టి నిరంజన్, టి.కుమార్‌రావు, జావెద్ అమీర్‌లను ప్రకటించింది.