Sunday, March 22, 2026

ఏపీకి కొత్త సీఎస్.. కేంద్రం నుంచి ఇక్కడికెందుకో..!?

కేంద్రంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్‌ అధికారి సమీర్‌ శర్మ.. ఏపీ సీఎస్ గా నియమితులయ్యారు.

కొనేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు తిరిగి రానున్నారు. కేంద్ర స్థాయి పోస్టును వదిలి ఆయన రాష్ట్ర స్థాయి పోస్టుకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఏపీకి ప్రస్తుతం సీఎస్‌గా ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉన్నారు. ఆయన 1987 బ్యాచ్‌కు చెందిన అధికారి. అయితే సమీర్‌ శర్మ(1985 బ్యాచ్).. దాస్ కంటే రెండేళ్లు సీనియర్‌.

దాస్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ఆయన సర్వీసును మరో 3 నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది.

అయితే ఆయన కొనసాగడం ఇష్టం లేని ఓ కీలక అధికారి.. కొనసాగింపు ప్రతిపాదనను ఆలస్యం అయ్యేలా చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి.

అంతేకాకుండా దాస్‌కు పొడిగింపు ఇస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి రాష్ట్రప్రభుత్వానికి సమాచారం అందింది.

మరోవైపు.. రాష్ట్రం అభ్యర్థన నేపథ్యంలోనే సమీర్‌ శర్మను ఏపీకి పంపుతున్నట్లు కేంద్ర నియామకాల కమిటీ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదిలా ఉంటే దాస్ పదవీ కాలం మరో మూడు నెలలు పెరగడంతో ఆయన సెప్టెంబరు చివర్లో రిటైర్ కానున్నారు. అంటే అప్పటిదాకా సమీర్‌ శర్మకు ఇక్కడ పనేమీ ఉండదు.

దీంతో సమీర్ శర్మను మొదటి మూడు నెలలు బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ(హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌గా నియమించే అవకాశం ఉంది.

ఆ తర్వాత సీఎస్ గా నియమిస్తారని అంచనా. అయితే సీఎస్‌ పదవి ఇచ్చినా.. మరో రెండు నెలల్లో, నవంబరు నెలాఖరులో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.

కానీ అప్పుడు ఒకవేళ ఏపీ ప్రభుత్వం.. ఆయన కొనసాగింపు కోసం కోరితే కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -