కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎంతో శ్రమించిన సీఎం కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్మన్లు పుట్ట మధు, జక్కు శ్రీహర్షిణిల ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఏర్పాటు జరగనుంది. ప్రాజెక్ట్‌కు హృదయం వంటి లక్ష్మీ బరాజ్ (మేడిగడ్డ బ్యారేజీ) దగ్గర 7 అడుగుల కేసీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విగ్రహ ఏర్పాటు కోసం జాడీపీ చైర్మన్లు శనివారం లక్ష్మీబరాజ్ (మేడిగడ్డ బ్యారేజీ) వద్ద పర్యటించారు.
విగ్రహ ఏర్పాటు కోసం స్థల పరీక్ష చేశారు. బరాజ్ సమీపంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని ఫైనల్ డెసిషన్ తీలుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ.. బీడువారిన భూములను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు.
అలాంటి మహనీయుడి మానస పుత్రికగా పిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలవుతున్న లక్ష్మీబరాజ్ వద్ద కేసీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఇప్పటికే విగ్రహాన్ని తయారు చేయించి అంబట్‌పల్లి గ్రామంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌రావు నివాసంలో ఉంచామన్నారు. అతి త్వరలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నామని తెలిపారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతి, మహదేవపూర్ సర్పంచ్ శ్రీపతిబాపు, యూత్ మండలాధ్యక్షుడు అలీంఖాన్, మహిళా అధ్యక్షురాలు అరుణ, ఉప సర్పంచ్ సల్మాన్, నాయకులు మనోహర్, రాకేశ్ పాల్గొన్నారు.