Friday, November 1, 2024

సొంత అక్కాచెల్లెళ్లకు జగన్ సమాధానం చెప్పలేకపోతున్నారేం!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల త్వరలోనే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న విషయం విదితమే. మరోవైపు ఇంకో చెల్లెల్లు అనగా బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తన తండ్రి మర్డర్ కేసుపై పోరాడుతున్నారు. ఢిల్లీ వేదికగా సునీత.. తన తండ్రి వివేకాను చంపిందెవరో తేల్చాలని తిరుగుతున్నారు. ఇటు సోదరి షర్మిల కొత్త పార్టీ.. అటు ఇంకో సోదరి సునీత న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకున్న టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తిరుపతి ఉప ఎన్నికలో అటు కాంగ్రెస్‌కు… ఇటు బీజేపీ, టీడీపీల అభ్యర్థులకు ఇదో అస్త్రంగా పనిచేస్తోందని చెప్పుకోవచ్చు.

ఆరు నెలల తర్వాత అధికారంలో ఉండరు!
కాంగ్రెస్ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తిరుపతి వేదికగా మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై వరుస ప్రశ్నాస్త్రాలు సంధించారు. అంతేకాదు.. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై కూడా విమర్శల వర్షం కురిపించారు. తిరుపతిలో జరిగే ధర్మయుద్ధంలో సీఎం జగన్ గెలవలేరని చింతా జోస్యం చెప్పుకొచ్చారు. గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ పట్టిన గతే బిజేపికి పట్టనుందని.. పవన్ తిరుపతి పర్యటనతో బీజేపీకి ప్రయోజనం శూన్యమని తెలిపారు. అంతేకాదు.. వైఎస్ వివేకా కుమార్తె ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పలేకపోతున్నారేం..? ప్రశ్నించారు. మరోవైపు.. జగన్ మీద కోపాన్ని షర్మిల తెలంగాణలో చూపిస్తున్నారని.. ఇలా సొంత అక్కా చెల్లెళ్లకు సమాధానం చెప్పలేని వ్యక్తి.. రాష్ట్రానికిగా సీఎంగా ఎలా పరిపాలిస్తారు? అని చింతా ప్రశ్నించారు. సీఎం జగన్ ఆరునెలల తర్వాత అధికారంలో ఉండరని జోస్యం చెప్పారు. అధిక ధరలు, బీజేపీ పతనానికి ప్రధాన హేతువు అని ప్రలోభాల పర్వం లేకపోతే ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

కౌంటర్ ఎటాక్‌లు..
మరోవైపు.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమల వెంకన్నను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దేవుడిపై నమ్మకం లేని వారు చేసే పని అని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో రాజకీయాల్లో మతాన్ని వాడినట్టు, తిరుపతిలోనూ వాడుతామని కొందరు నేతలు అనుకుంటుండం సిగ్గుచేటన్నారు. తిరుపతిలో మత విద్వేషాలు ఎప్పుడూ లేవని.. మత దాడి చేయాలనుకునే వారికి ఈ జన్మలోనే ఆ కర్మ తగులుతుందన్నారు. పవన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన భూమన.. తిరుపతిలో మాట్లాడిన ఓ పెద్ద మనిషి గతంలో బీజేపీపై విమర్శలు చేశారని గుర్తు చేశారు. అప్పట్లో బీజేపీని నమ్మితే నట్టేట ముంచుతుందని చెప్పారని.. ఇప్పుడు ఆయన కూడా మతాన్ని గురించి మాట్లాడం దారుణమని భూమన చెప్పుకొచ్చారు. ఇలా ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, కౌంటర్లు, ప్రతి కౌంటర్ల వర్షం కురిపించుకుంటున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x