చారిత్రాత్మక పోరుకు అన్నీ సిద్ధమయ్యాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి జరగబోతున్న ఈ పోరులో న్యూజిలాండ్ జట్టుతో భారత్ తలపడబోతోంది. ఈ మ్యాచ్ రేపు(శుక్రవారం) ప్రారంభం కానుండగా..ఇరు జట్లూ శక్తి మేరకు సిద్ధమయ్యాయి. బలమైన జట్లతో బరిలోకి దిగుతున్నాయి. అయితే డబ్ల్యూతీసి ఫైనల్ ఆడే భారత తుది జట్టును బీసీసీఐ నేడు(గురువారం) ప్రకటించింది. తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరికీ చోటు లభించింది. హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్‌లు బెంచ్‌కు పరిమితమయ్యారు.
భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ.
మరోపక్క కివీస్.. 15 మందితో కూడిన జట్టునే ఇప్పటివరకు ప్రకటించింది. ఇటీవల గాయం కారణంగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టుకు గైర్హాజరైన కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా జట్టులో ఉన్నాడు.
కివీస్ జట్టు: కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వాయ్, కాలిన్ డీ గ్రాండ్ హోమ్, మ్యాట్ హెన్రి, కైల్ జెమీసన్, టామ్ లాథం, హేన్రి నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్.