Thursday, November 21, 2024

నాదల్ షాకింగ్ డెసిషన్.. అభిమానులకు షాక్

స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫేల్ నాదల్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులకు ఊహించని షాక్ ఇస్తూ.. ఈ నెల 28న ప్రారంభమయ్యే వింబుల్డన్ ఛాంపియన్షిప్ పోటీలతో పాటు వచ్చే నెలలో మొదలయ్యే టోక్యో ఒలింపిక్స్‌లోనూ తాను పాల్గొనబోనని ప్రకటించాడు. 20 సార్లు గ్రాండ్ స్లామ్‌, 2 సార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన 35 ఏళ్ల ఈ స్పెయిన్ బుల్.. గురువారం ట్విటర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

‘‘హాయ్ ఆల్… ఈ ఏడాది జరిగే వింబుల్డన్ చాంపియన్‌షిప్స్, టోక్యో ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాను. ఇది అంత తేలికైన నిర్ణయమేమీ కాదు.. కానీ నా శరీరం చెబుతున్నది విన్న తర్వాత, నా బృందంతో చర్చించిన తర్వాత.. ఈ నిర్ణయం సరైనదేనని అర్థం చేసుకున్నాను.’’ అంటూ నాదల్ తన ట్వీట్లొ పేర్కొన్నాడు.

కెరీర్‌ని మరింత కాలం పాటు కొనసాగించడం, సంతోషంగా ఉండే పనులు చేయడమే తన లక్ష్యమని నాదల్ రాసుకొచ్చాడు. అలాగే వృత్తిపరమైన, వ్యక్తిగతమైన లక్ష్యాలను సాధించేందుకు పూర్తి స్థాయిలో పోటీపడాలని, వాటి కోసం పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

కాగా.. ఇటీవల ప్యారిస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌ల్ సెమీ ఫైనల్ వరకు చేరుకున్న నాదల్.. నొవాక్ జెకోవిచ్ చేతిలో 6-3, 3-6, 6-7, 2-6 తేడాతో ఓడిపోయాడు. ‘కింగ్ ఆఫ్ క్లె’ గా ఎర్రమటీపై ఎదురులేని స్టార్ ఆటగాడిగా పేరున్నా.. జకో చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఈ ఓటమి బాధ నుంచి బయటపడేందుకే తాజా నిర్ణయం తీసుకున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x