Sunday, March 22, 2026

ఏనుగు బ్యాటింగ్.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. వైరల్ వీడియో!

సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూసి ఆనందపడి ఉంటారు. సెహ్వాగ్ సిక్సులు చూసి మురిసిపోయి ఉంటారు. కోహ్లీ క్లాస్ బ్యాటింగ్‌కు ఫిదా అయి ఉంటారు. ఇక విదేశీ ఆటగాళ్ల విచిత్రమైన షాట్లకు సూపర్ అంటూ క్లాప్స్ కొట్టి ఉంటారు. అయితే ఈ ఏనుగు బ్యాటింగ్ చూస్తే మాత్రం మీ కచ్చితంగా అమ్మబాబోయ్ అంటూ నోరెళ్లబెడతారు. నమ్మకపోతే ఈ వీడియో చూడండి. ఇందులో ఓ ఏనుగు కొబ్బరి మట్టను బ్యాట్‌గా మలుచుకుని తొండంతో పట్టుకున్న ఏనుగు అవతలి నుంచి యజమాని విసిరే బంతులను అవలీలగా భారీ షాట్లు కొ్ట్టేస్తుండడం చూడవచ్చు.

ప్రేమ్‌ అనే నెటిజన్‌ ఈ ఏనుగు బ్యాటింగ్ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘మీరెప్పుడైనా ఏనుగు క్రికెట్‌ ఆడడం చూశారా? చూడండి నేషనల్‌ ప్లేయర్స్‌ కంటే
ఈ ఏనుగే బాగా ఆడుతోంది’ అంటూ తన పోస్ట్‌‌లో పేర్కొన్నాడు. అయితే ఆ పోస్ట్‌‌ను ఇంగ్లండ్‌ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌ మళ్లీ షేర్ చేయడంతో ఇప్పుడిది తెగ సెన్సేషన్ అవుతోంది. వాన్ తన పోస్టుకు ‘అవును నిజమే! నేషనల్‌ ప్లేయర్స్‌ కంటే ఇదే బాగా అడుతోంది. తప్పకుండా ఇంగ్లండ్‌ పాస్‌ పోర్ట్‌ ఇప్పిస్తాం’ అంటూ వాన్ చమత్కరించాడు.


ఆ వీడియోలో ఓ ఏనుగు బ్యాటింగ్‌ చేస్తుంటే, దాని యజమాని బౌలింగ్‌ చేస్తున్నాడు. యజమాని బాల్‌ ఎలా వేసినా ఏనుగు మాత్రం తన అద్భుతమైన బ్యాటింగ్‌తో సునాయాసంగా చుట్టూ ఉన్న వ్యక్తుల పైనుంచి బయటకు బాదేస్తోంది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఏనుగు బ్యాటింగ్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. అయితే ఈ వీడియోను వాన్‌ షేర్ చేయడం పట్ల కొంతమంది చురకలు కూడా అంటిస్తున్నారు. ‘పిచ్ సరిగా లేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్ళు దానిపై ఆడలేరు’ అంటూ ఓ నెటిజన్‌ వ్యంగాస్త్రాలు విసిరితే.. మరో నెటిజన్.. ‘టీమిండియా ఆటగాళ్ల దాకా ఎందుకు మా ఏనుగు కూడా మీ ప్లేయర్లను ఓడించేస్తుంది’ అంటూ కామెంట్ చేశాడు

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -