Sunday, March 22, 2026

మదర్స్ డే స్పెషల్: మనసులు దోచే క్రికెటర్ల మదర్స్ డే పోస్టులు

అమ్మ..! ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో.. ఎంత చెప్పినా తక్కువే.. మాటలతో ఏ మాత్రం వర్ణించలేనిది అమ్మ ప్రేమ. బిడ్డ నవ్వుతుంటే చూస్తూ తానూ మురిసిపోతుంది. కష్టమొచ్చి కన్నీరుపెడితే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. అందుకే ప్రతి బిడ్డకు తల్లంటే అనిర్వచనీయమైన మమకారం ఉంటుంది. ఆ బిడ్డ ఎంత ఎత్తుకు ఎదిగినా.. తల్లిపై ఉండే ప్రేమ మాత్రం కొంచెం కూడా తగ్గిపోదు. దీనికి సినిమా స్టార్స్ ఏ మాత్రం మినహాయింపు కాదు.


ఈ రోజు మదర్స్ డే సందర్భంగా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు తమ తల్లులకు మదర్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమా సెలబ్రిటీలు, క్రికెటర్లు అంతా తమ తల్లులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అమ్మలకు అప్యాయతతో కూడిన శుభాకాంక్షలు చెప్పారు. ఒక్క ఇండియా క్రికెటర్లే కాదు.. విదేశీ క్రికెటర్లు కూడా తమ తల్లులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ మాతృప్రేమను పంచుకుంటున్నారు.


భారత లెజండరీ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ మొదలుకొని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్​, టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ ఆజింక్య రహానె, సీనియర్ ఆటగాడు సురేశ్‌ రైనా, టీమిండియా ఓపెనర్ శిఖర్‌ ధవన్, సీనియర్ వికెట్ కీపర్ దినేశ్‌ కార్తీక్‌, టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, విండీస్ సిక్సర్ల వీరుడు క్రిస్‌గేల్‌, శ్రీలంక ఆటగాడు దినేశ్‌ చండిమాల్‌, ఆసీస్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ తదితరులు తమ తల్లులతో ఉన్న అనుబంధాలను.. తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ట్విటర్లో ఫొటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


ఇక వీరు మాత్రమే కాకుండా ఇంకా క్రికెట్‌కు సంబంధించిన అనేకమంది సెలబ్రిటీలు కూడా తమ తల్లులపై తమ ప్రేమను పంచుకున్నారు. అమ్మలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అమ్మల దీవెలను తీసుకున్నారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -