Sunday, March 22, 2026

సచిన్ క్యూట్‌నెస్‌కు ఫిదా అయ్యా.. భార్య అంజలి

ముంబై: క్రికెట్లో ఎన్నో ప్రేమ జంటలుంటాయి. వారిలో ఎంతోమంది పెళ్లి వరకు వెళ్లరు. కానీ.. పెళ్లి వరకు వెళ్లిన జంటల్లో చాలా మంది ఇప్పటికీ కలిసే ఉంటున్నారు. అలాంటి జంటల గురించి మాట్లాడుకున్నప్పుడు.. ప్రధానంగా క్రికెట్ ప్రేమికులందరికీ గుర్తొచ్చేది క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌-అంజలి టెండూల్కర్. అలనాటి ఈ జంట ఈ నాటికీ క్రికెట్ ప్రేమ జంటల్లో దీ బెస్ట్ అనే చెప్పాలి. అయితే సచిన్ కంటే 5ఏళ్ల వయసులో ఎక్కవ అయినా.. అంజలి కానీ, సచిన్ కానీ ఆ విషయంలో పెద్దగా ఆలోచించలేదు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురించడం, పెళ్లి జరగడం, ఇద్దరు పిల్లలు, వాళ్లు కూడా పెద్ద కావడం అంతా జరిగిపోయింది. అయితే తాజాగా అంజలి తన ప్రేమ గురించి వివరించారు. తొలిసారి సచిన్‌ను చూడగానే తనకేం అనిపించిందో చెప్పుకొచ్చారు. 1995లో సచిన్,​ అంజలి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి సారా, అర్జున్ జన్మించారు. సచిన్ సతీమణి అంజలి వృత్తి రీత్యా డాక్టర్. ప్రస్తుతం సచిన్ వయసు 48 కాగా.. అంజలికి 53.

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంజలి టెండూల్కర్.. సచిన్‌తో తన తొలి పరిచయానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 1990 ఇంగ్లండ్ పర్యటన అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన సచిన్‌ను మొదటిసారిగా ముంబై ఎయిర్​పోర్ట్‌లో చూశానని, అప్పటికీ సచిన్ ఎవరో తనకు తెలీదని, క్యూట్‌గా ఉండడం వల్ల అతని వెంట పడ్డానని అంజలీ చెప్పారు. అప్పటికి సచిన్‌ వయసు 17 ఏళ్లని, అయినా తనకి 12 ఏళ్ల పిల్లాడిలా కనిపించాడని ఆమె తెలిపారు.

‘సచిన్‌ను తొలిసారి ఎయిర్​పోర్ట్‌లో చూసినప్పుడు నా ఫ్రెండ్​ అపర్ణ నాతో ఉంది. తనే నాకు సచిన్‌ గురించి చెప్పింది. క్రికెట్లో సచిన్‌ ఒక అద్భుతమని.. అతి చిన్న వయసులో సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన ఆటగాడని అపర్ణ చెప్పింది. అప్పట్లో క్రికెట్‌పై నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అందుకే అతడెవరైతే నాకేంటని అనుకున్నా. అయితే సచిన్‌ క్యూట్‌నెస్‌ని చూసి ఫిదా అయ్యాను. అందుకే అతని వెంట పరుగెత్తానం’టూ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంలో నేను వెంటపడుతున్నానని తెలిసి సచిన్‌ చాలా ఇబ్బంది పడ్డాడని, కనీసం నా వైపు చూసే సాహసం ​కూడా చేయలేదని నవ్వుతూ వివరించారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -