సోషల్ మీడియా రకరకాల పోస్టులు పెడుతూ, ఫోటోలు షేర్ చేస్తూ.. వాటికి వచ్చే లైక్స్ చూసుకుని మురిసిపోతుంటారు అనేకమంది. అయితే కొంతమందికి తక్కువ లైక్స్ వస్తున్నాయని, వాటిని అందరికీ ఎలా చూపించుకోవాలని తెగ బాధ పడిపోతుంటారు. అలాంటి వారి కోసం ఫేస్బుక్ ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే ‘హైడింగ్ లైక్స్’ ఫీచర్. ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రాంలో కూడా ఈ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. దీనివల్ల పోస్టుల లైక్స్ చూసి కాకుండా.. ఆ పోస్ట్‌లోని విషయాన్ని బట్టి దానిని నెటిజన్లు ఇష్టపడతారని, కంటెంట్‌పై దృష్టి సారిస్తారని ఫేస్ బుక్ భావిస్తోంది. అందుకే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.
ఫేస్బుక్ తీసుకొచ్చిన కొత్త టూల్స్ ద్వారా తమ యూజర్స్ తమ ఖాతాల్లోని ప్రమాదకరమైన కంటెంట్‌ను ఫిల్టర్ చేసుకోగలుగుతారని, అలాగే ఫేస్బుక్ న్యూస్ ఫీడ్‌పై ఏది చూడాలి, ఏది పంచుకోవాలి..? అనే అంశాలను నియంత్రించగలుగుతారని తెలుస్తోంది. ఇప్పుడు యూజర్స్ మరింత ప్రైవసీని, సౌకర్యాలను కోరుకుంటున్నారనీ రాబోయే కొద్ది వారాలో ఈ కంట్రోల్స్ అన్నీ కూడా ఫేస్‌బుక్‌పై కనిపించనున్నాయనీ ఫేస్బుక్ ప్రకటించింది. ఇప్పుడు యూజర్స్ మరింత ప్రైవసీని, సౌకర్యాలను కోరుకుంటున్నారనీ రాబోయే కొద్ది వారాలో ఈ కంట్రోల్స్ అన్నీ కూడా ఫేస్‌బుక్‌పై కనిపించనున్నాయనీ ఫేస్బుక్ తెలిపారు.
లైక్స్ ద్వారా కొందరు ఏ వీడియో ట్రెండింగ్‌లో ఉంది అనే విషయం తెలుసుకుంటారు. అలాగే ఎక్కువ లైక్స్ వచ్చిన పోస్ట్‌ను చూడడం, తక్కవ లైక్స్ వచ్చిన పోస్ట్‌ను పట్టించుకోకపోవడంతో ఆ పోస్టులు పెట్టిన వారిపై మానసికంగా కూడా ప్రభావం పడుతోందట. ఈ క్రమంలోనే ఫేస్బుక్ కొత్తగా మార్పు చేర్పులు చేసింది. దీనివల్ల సొంత పోస్ట్‌లపై లైక్ కౌంట్స్‌ను దాచుకునే అవకాశం యూజర్లకు లభిస్తుంది. దాంతో ఎవరైనా సరే మన పోస్ట్‌లకు ఎన్ని లైక్‌లు వచ్చాయన్న అంశంపై దృష్టి సారించకుండా, మనం షేర్ చేసే ఫోటోలు, వీడియోలపై మాత్రం దృష్టి సారించవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి న్యూ పోస్ట్స్ విభాగంలో మార్పుల చేయడం ద్వారా ఇతరుల పోస్ట్‌లపై లైక్ కౌంట్స్‌ను దాచుకునే వీలుంది. ఒకసారి లైక్స్ హైడ్ చేస్తే.. అన్ని పోస్ట్‌లకూ ఇది వర్తిస్తుంది.