Sunday, March 22, 2026

ఆన్సర్ అశ్విన్ చెబుతాడేమో.. మాజీ క్రికెటర్ పోస్ట్ వైరల్

జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌, టీమిండియాల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. కివీస్‌ ఇప్పటికే ఇంగ్లండ్‌లో తమ ప్రాక్టీస్‌ను ఆరంభించగా.. టీమిండియా జూన్‌ 2న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. ఈ క్రమంలోనే ఈ టోర్నీకి సంబంధించి శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) శుక్రవారం మ్యాచ్‌కు సంబంధించి కొన్ని కీలక సూచనలు చేసింది. దీంతోపాటు 95 పేజీల బుక్‌ను రూపొందించి సమగ్రంగా వివరించిందిజ అలాగే దానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను వివరించింది.

కాగా.. ఐసీసీ విడుదల చేసిన ఆ బుక్‌పై టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ తన స్టైల్లో ట్రోల్ చేశాడు. ఐసీసీతో పాటు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కూడా మధ్యలోకి లాగాడు. ”ఒక్క ముక్క అర్థం కాలేదు.. టీమిండియాలో రవిచంద్రన్‌ అశ్విన్‌ అందరికంటే జీనియస్‌.. మంచి మేథమెటిషీయన్‌గా పేరున్న అశ్విన్‌ స్టాట్స్‌ , రూల్స్‌ గురించి బాగా వివరిస్తాడు. అందుకే అతన్ని అడుగుతా” అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. జాఫర్ ట్వీట్‌పై స్పందించిన అశ్విన్‌.. ”అరె భాయ్‌.. ముందు బుక్‌ను బాగా చదువు.. మేం కూడా అందులో ఏముందో తెలుసుకోవాలి” అంటూ లాఫింగ్‌ ఎమోజీతో కామెంట్‌ చేశాడు.

ఇదిలా ఉంటే డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఎవరు గెలుస్తారనే విషయంలో అంతా తెగ ఆసక్తిగా ఉన్నారు. అయితే రెండు మేటి జట్లు పోటీ పడుతుండడంతో డ్రా అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే రిజర్వ్ డే ప్రతిపాదనను తొలుత ఐసీసీ పరిశీలించింది. దీని ప్రకారం 5 రోజుల్లో వాతావరణ సమస్య వల్ల 30 గంటలకంటే తక్కువ ఆట జరిగితే 6వ రోజు కూడా టెస్టు ఆడించాలని ఆలోచించింది. అయితే తాజాగా ఈ నిర్ణయానికి మరో కొత్త రూల్‌ను జోడించింది. ప్రతికూల పరిస్థితుల్లో 6వ రోజు మ్యాచ్‌ డ్రా అయినా.. లేదా టై అయినా ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని ఐసీసీ వెల్లడించింది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -