Sunday, March 22, 2026

కూలీ పనైనా ఇప్పించండి.. పుట్టెడు దఃఖంలో పోస్ట్ గ్రాడ్యుయేట్

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. రోజూ లక్షల మందిని కబళిస్తూ.. వేల మందిని బలి తీసుకుంటోంది. ఇక కోట్ల మందిని ఆకలితో అలమటించేలా చేస్తోంది. ఉద్యోగాలు కోల్పోయి నానా అవస్థలు పడుతున్న బాధితులు ప్రస్తుతం ఎంతో మంది దేశంలో ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే దేశ రాజధాని న్యూడిల్లీకి చెందిన వికాస్. అతడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. యూజీసీ లెక్చరర్‌ ఉద్యోగాల కోసం నిర్వహించే జాతీయస్థాయి అర్హతా పరీక్ష కూడా పాసయ్యాడు. కానీ కరోనా దెబ్బకు అతడి జీవితం కుదేలైంది. చదువును పక్కన పెట్టి, పొట్టపోసుకునేందుకు ఏ పనైనా చేస్తాననే దీనస్థితికి చేరాడు. దీంతో ఆదివారం అతడో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

‘నాకు ఏదైనా పని ఇప్పించి, సాయం చేయండి. ఈ లాక్‌డౌన్ వల్ల బతకడం కష్టంగా మారింది. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి నాకు ఏ పనీ లభించడం లేదు. ఏ పని చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాను.. కానీ నాకు అసలు పనే దొరకడం లేదు. రోజూవారీ కూలీగా పనిచేయడానికి కూడా నేను సిద్ధమే’ అంటూ అతడు తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఈ ట్వీట్‌పై నెటిజన్లు కూడా స్పందిస్తూ.. వికాస్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కాగా, ఈ ట్వీట్‌పై నెటిజన్లు స్పందించారు. కొందరు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వగా.. మరికొందరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. ‘పాలకవర్గం ఇకనైనా సామాన్య ప్రజల కష్టాలను గ్రహిస్తుందని ఆశిస్తున్నాం’ అని మరొకరు ఆవేదన వెళ్లగక్కారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -