తెలంగాణలో మరో 10 రోజులు లోక్ డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సర్కారు ప్రకటించింది ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు అమలులో ఉన్న లాక్ డౌన్ మినహాయింపును మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రంరం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ రోజు(మంగళవారం) సాయంత్రం సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నారు. మార్పు చేసిన నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రయాణ మినహాయింపుగా ప్రకటించింది. కాగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మార్పులు చేసిన ఈ లాక్‌డౌన్ ఈ లాక్‌డౌన్ పొడిగింపు జూన్ 10 నుంచి అమల్లోకి రానుంది.
కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి, నకిరేకల్ మినహా మిగతా నల్లగొండ జిల్లాలో ఈ మినహాయింపులు వర్తించవని, ఇప్పటివరకు కొనసాగిన లాక్‌డౌన్ యథాతథంగా అక్కడ కొనసాగుతుందని సర్కార్ ప్రకటించింది. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 2 గంటల వరకూ లాక్‌డౌన్‌ను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
కాగా.. ఈ మంత్రి వర్గ సమావేశంలో లాక్‌డౌన్ గురించి మాత్రమే కాకుండా.. ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. అలాగే హైదరాబాద్ మినహా పాత 9 జిల్లాల్లో తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అలాగే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 4,46,169 రేషన్ కార్డులను కూడా మంజూరు చేయాలని మంత్రులు నిర్ణయించారు. తెలంగాణలో 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఈ సబ్ కమిటీ పని చేయనుంది. కమిటీలో సభ్యులుగా హరీష్‌రావు, తలసాని, సబిత, ఇంద్రకరణ్‌రెడ్డి ఉండనున్నారు.