Friday, November 1, 2024

మళ్లీ లాక్‌డౌన్ పొడిగింపు.. సడలింపుల్లోనూ మార్పులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది. మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రోజుతో కరోనా లాక్‌డౌన్ రెండో విడత ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వర్గంతో కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించిన అనంతరం వచ్చే నెల 10వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఇన్నాళ్లు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉండగా.. ఇక నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మినహాయింపును ఇస్తున్నట్లు ప్రకటించారు.

కాగా.. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నెల 12న తొలిగా లాక్‌డౌన్ విధించారు. 22వ తేదీ వరకు తొలి విడత కొనసాగింది. ఆ తర్వాత మళ్లీ 22వ తేదీ సాయంత్రం క్యాబినెట్ సమావేశం నిర్వహించిన కేసీఆర్.. 30 వరకు పొడిగించారు. అప్పటి నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ రోజుతో ఆ తేదీ కూడా ముగియనుండగా.. ఇప్పుడు మరోసారి కొనసాగించారు.

కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి భూమి, వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రభుత్వ రెవెన్యూ లోటును దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రభుత్వం ఈ మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో 18 రోజులుగా నిలిచిపోయిన భూమి, వాహన రిజిస్ట్రేషన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x