వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) మార్స్ గ్రహంపైకి క్యూరియాసిటీ రోవర్‌ను పంపించింది. దీని ద్వారా అరుణగ్రహంపై వాతావరణాన్ని, అక్కడి ఖనిజాలను, జలవనరులను అధ్యయనం చేస్తోంది. అలాగే అక్కడ మానవుని మనుగడకు ఉండే అవకాశాలపై కూడా శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తున్నారు. ఈ క్రమంలోనే క్యూరియాసిటీ అనేక ఫోటోలను, శాంపిళ్ల పరిశోధనలను భూమికి పంపింస్తోంది. అయితే తాజాగా ఆ రోవర్ పంపిన ఫోటోలు సైంటిస్టులను ఆశ్చర్యపరుస్తున్నాయి. దానికి కారణం మార్స్‌పై ఉండే మేఘాలే. అందులో వింతేముంది అంటారా..? కచ్చితంగా ఉంది. ఎందుకంటే మార్స్‌పై మేఘాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.
క్యూరియాసిటీ రోవర్ తాజాగా మార్స్‌పై ఉన్న మేఘాల ఫోటోలను తీసి భూమికి చేరవేసింది. అయితే మార్స్‌పై వాతావరణం పొడిగా ఉండడం వల్ల అక్కడ మేఘాలు ఏర్పడటం ఎప్పుడో కానీ జరగదు. సూర్యుడి నుంచి మార్స్ చాలా దూరంగా ఉన్న సమయంలో, అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భంలో మార్స్ భూమధ్య రేఖ వద్ద ఈ మేఘాలు కనిపిస్తాయి. అయితే ఈ మేఘాలు నాసా ఊహించినదాని కంటే ముందుగా మేఘాలు కనిపించడంతో శాస్త్రవేత్తలు దీనికి గల కారణాలు బయటకు తీసే పనిలో పడ్డారు.
ఈ ఏడాది మార్చి 5న మాస్ట్‌క్యామ్ ద్వారా కొన్ని ఫోటోలను తీయగా.. మార్చి 31న మరోసారి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను క్యూరియాసిటీ రోవర్ తీసింది. వీటిని నాసా హెడ్‌క్వార్టర్స్‌కు పంపగా.. ఆ ఫోటోల్లో మార్స్‌పై ఏర్పడిన మేఘాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోలను విశ్లేషించడం ద్వారా మార్స్‌పై అసలు మేఘాలు ఏర్పడడానికి గల కారణాలను, తాజాగా ఏర్పడిన మేఘాలకు సాధారణ మేఘాలకు గల తేడాను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలను చేస్తున్నారు.