క్రికెట్లో అప్పుడప్పుడూ సరదా సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మరికొన్ని సార్లు ఆటగాళ్లే సరదాగా కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అందులోనూ బ్యాట్స్‌మన్, బౌలర్ల మధ్య జరిగే చిలిపి సంఘటనలు క్రికెట్లో బాగా వైరల్ అవుతుంటాయి. వాటికి సంబంధించిన వీడియో కూడా క్రికెట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇంతకుముందు కూడా ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్లు అనేకం చోటు చేసుకున్నాయి. కానీ కొన్ని మాత్రం ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి.
తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మిడిల్‌సెక్స్, హాంప్‌షేర్ మధ్య మ్యాచ్ మంగళవారం ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మిడిల్‌సెక్స్ బ్యాట్స్‌మన్ నిక్ గుబ్బిన్స్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. ఇన్నింగ్స్ మధ్యలో హాంప్‌షేర్ బౌలర్ కీత్ బార్కర్ వేసిన ఓవర్లో నిక్ బ్యాక్‌వర్డ్ దిశగా షాట్ ఆడాడు. 2 పరుగులు తీయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపు వెళ్లిన నిక్ క్రీజులో జారి పడిపోయాడు. దీంతో రెండో పరుగు సాధ్యం కాలేదు.
ఇదంతా ఓ ఎత్తయితే.. నిక్ జారి పడే సమయానికి బార్కర్ బౌలర్ వెనక్కి వస్తున్నాడు. అప్పటికే క్రీజులో కిందపడి ఉన్న నిక్‌కు హెల్ఫ్ చేస్తున్నట్లుగా చేయి అందించాడు. అది చూసిన నిక్.. అతడి చేయి అందుకోబోయాడు. కానీ ఇంతలో బార్కర్ వెంటనే తన చేయి వెనక్కి తీసేసుకుని వెళ్లిపోయాడు. దీంతో షాకవడం నిక్ వంతయింది. అంతలో తనంతతానే పైకి లేచిన నిక్.. బార్కర్‌ను చూస్తూ ఉండిపోయాడు. గ్రేడ్ క్రికెటర్ అనే నెటిజన్ దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేయడంతో ఇప్పుడది తెగ వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో హాంప్ షైర్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన మిడిల్‌సెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత హాంప్‌షేర్ తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగులు చేసి 36 పరుగులు ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో మిడిల్‌సెక్స్ 101 పరుగులకే కుప్పకూలడంతో 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హాంప్ షైర్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.