హిమాచల్ ప్రదేశ్‌లోని ఖజియార్ ప్రాంతంలో పారా గ్లైడింగ్ చేస్తుంటారు. ఇక్కడికి ప్రతిరోజు అనేకమంది పారా గ్లైడింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అదే ఆలోచనతో ఓ యువతి కూడా అక్కడ గ్లైడింగ్ చేసేందుకు వెళ్లింది. గాలిలో ఎగురుతున్న వారిని ఆమె చూసి చాలా థ్రిల్లింగ్‌గా ఫీల్ అయింది. గ్లైడింగ్ సూట్ వేసుకుంది. పైలట్‌తో కలిసి ఫ్లైయింగ్‌కి రెడీ అయింది. అలా గాలిలోకి ఎగరగానే ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. పైలట్‌తో కలిసి అలా ముందుకు కదలగానే.. నేలవైపు చూడగానే ఒక్కసారిగా ఆమెకు ఎక్కడలని భయం కలిగింది. అంతే అరుపులు, కేకలు పెట్టి గట్టిగా ఏడుస్తూ.. తనను కిందకు దించేయాలని వెనకున్న పైలట్‌ను వేడుకోవడం మొదలు పెట్టింది.
ఆమె అరుపులు, ఏడుపులు చూసిన పైలెట్ ప్రశాతంగా ఉండాలని ఆమెకు సూచించాడు. అతడో ప్రొఫెషనల్ కావడంతో ఆమెకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించాడు. ఏమీ కాదంటూ భరోసా ఇచ్చాడు. గ్లైడింగ్‌ను ఎంజాయ్ చేయాలని, తాను వెనకే ఉన్నానని, తాను చూసుకుంటానని చెప్పాడు. కానీ ఆమె మాత్రం భయంతో కేకలు పెడుతూనే.. కళ్లు మూసుకుంది. దీనిని గమనించిన పైలెట్ దీర్ఘ శ్వాస తీసుకోవాలని, ఎంజాయ్ చేయాలని చెప్పాడు. ఆమెకు చెబుతూ, మరింత ఉత్సాహపరిచాడు. కానీ ఆమె భయం తగ్గలేదు. తనను వెంటనే కిందకు దింపేయాలని కోరింది. ఈ దృశ్యాలు మొత్తం కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.