Sunday, March 22, 2026

పవన్‌కి కరోనా పాజిటివ్‌.. అభిమానుల రియాక్షన్‌ ఇదే

పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన వ్యవసాయ క్షేత్రంలోనే క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ విషయం తెలిసిన అభిమానులు అన్నయ్య నీకేమి కాదు నువ్వు త్వరగా కోలుకుని మళ్ళీ మా అందరి మధ్యలోకి రావాలంటూ భాదాతప్త హృదయాలతో ట్విట్స్ చేస్తున్నారు.

అన్నయ్య….. మాలో మీరు నింపే శక్తి మనోధైర్యంతో మమ్మల్లని ముందుకు వెళ్ళాలి అని మీరు చెప్పే మాటలు చాలా ఉంది ఇంకా కసిగా మేము ఉన్నాం…. మీరు త్వరగా కోలుకోవాలని ఆ పంచభూతాలను వేడుకుంటున్నా… అంటూ ఓ అభిమాని,


తట్టుకోలేనంత బాధ కలిగించే వార్త.. త్వరగా కోలుకుని మా అందరికి అడుగుజాడై నిలవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము… అంటూ ఓ అభిమాని,


ఎన్నో దాన ధర్మాలు చేసిన చేతులు అవి, ఎందరికో అండగా నిలిచిన గుండె అది. అవినీతి మరక లేని స్వచ్చమైన మనసు అది. అందుకే ఖచ్చితంగా భగవంతుడు అండగా ఉంటాడు అని నేను బలంగా నమ్ముతున్నాను… అంటూ మరో అభిమాని,


పది మంది కడుపు కొట్టి బ్రతికే వాళ్ళు బాగానే ఉన్నప్పుడు… పది మంది కడుపు నింపెవాడికి ఏమౌతుంది..హా కంగారు పడకండి… కంగారు పెట్టకండి… దైవ బలం మెండుగా ఉన్న మనిషి ఆయన.. అంటూ ఎందరో అభిమానులు భగవంతుణ్ణి కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అంటూ తమ వేదనని, ఆవేదనని వ్యక్తం చేస్తూ ట్విట్స్ చేస్తున్నారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -