Wednesday, January 22, 2025

‘డంకీ’ ఫస్ట్ డే ఫస్ట్ షో‌ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

షారూక్ ఖాన్ లేటెస్ట్ భారీ మూవీ ‘డంకీ’ కోసం ఎంతో ఎగ్జయిటెడ్‌గా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచే సినిమాపై అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. డంకీ డ్రాప్ అంటూ సినిమా పాటలు, ట్రైలర్‌, వీడియోతో సినిమాపై రోజు రోజుకీ ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఒక్కో మెట్టు పెరుగుతూ వచ్చాయి. దేశం యావత్తు ఉన్న షారూక్ అభిమానులు తమ ప్రేమను చూపించుకుంటూనే ఉన్నారు. ఇక విదేశాల్లోని కింగ్ ఖాన్ ఫ్యాన్స్ సైతం తమ అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు విదేశాల నుంచి ఇండియాకు డంకీ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోను ఎస్ఆర్‌కె పూనే టీమ్‌తో కలిసి చూడటానికి రావటం విశేషం. డంకీ సినిమా కోసం అభిమానులు ఎంత ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారనటానికి వారు చూపిస్తున్న అభిమానమే ఉదాహరణగా చెప్పొచ్చు.

సూపర్ స్టార్ షారూక్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమతో తడిసి ముద్దవుతున్నారు. అభిమానుల ప్రేమను ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి అభిమానులందరూ ఒక చోట చేరి అందమైన కథను ఆస్వాదించటానికి డంకీ రూపంలో చక్కటి అవకాశం ఏర్పడింది. ఎస్ఆర్‌కె పూనే టీమ్‌తో కలిసి 100 మంది ఫారిన్ ఫ్యాన్స్ ఇండియా వచ్చి డంకీ ఫస్ట్ డే ఫస్ట్ షోను చూడబోతున్నారు.

యు.ఎస్.ఎలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన తొలిరోజునే 5000 టికెట్స్ అమ్ముడయ్యాయంటే డంకీ సినిమాపై ఓవర్ సీస్ మార్కెట్‌లో ఎంత క్రేజ్ ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ అభిమానాన్ని షారూక్ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నటికెట్సే ఉదాహరణ.

డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకోనున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x