Wednesday, January 22, 2025

పూర్ణోదయ గర్వించదగ్గ సంస్థ: మెగాస్టార్ చిరంజీవి

ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’. ‘జాతి రత్నాలు’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఈ చిత్రం మెగా ప్రీరిలిజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో’ ప్రీరిలీజ్ ఈవెంట్ రావడానికి ప్రధానమైన కారణం మా ఏడిద నాగేశ్వర‌రావు గారు. వారి ఆశీస్సులు మనందరిపైన వుంటాయి. వారితో నాకు కుటుంబపరమైన అనుబంధం వుంది. నేనూ వారి కుటుంబ సభ్యుడినైపోయాను. వారు నాపై చూపిన ప్రేమ వాత్సల్యం ఎప్పటికీ మర్చిపోలేను. పూర్ణోదయ గర్వించదగ్గ సంస్థ. దానికి కారణం అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వర‌రావు గారు. ఆయన అభిరుచికి తగ్గట్టు విశ్వనాథ్ గారితో కలసి ప్రపంచంలో తెలుగు వారు గర్వించదగ్గ చిత్ర రాజాలు తీశారు. శంకరాభరణం, స్వాతి ముత్యం, సాగర సంగమం, నాతో తీసిన స్వయంకృషి, ఆపద్బాంధవుడు, ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించారు ఏడిద నాగేశ్వర‌రావు గారు. ఏడిద నాగేశ్వర‌రావు గారి కుటుంబంతో వున్న అనుబంధం కారణంగానే ఈ వేడుకకు వచ్చాను. నేను రావడం వారికి ఎంత తృప్తిని ఇచ్చిందో చెప్పలేను కానీ నాకు అత్యంత తృప్తిని ఇస్తోంది.

సినిమా రంగంలోనే పెరిగాను. ఇక్కడే ప్రేమానురాగాలు పొందాను. ఈ రంగం నుండి మరో రంగాని వెళ్లి మళ్ళీ ఇక్కడికి వచ్చినపుడు దీని విలువల మరింత ఎక్కువ తెలిసింది, సినిమా అనేది చాలా గొప్ప పరిశ్రమ. ప్రతిభ వుండి కష్ట పడితే ప్రతిఒక్కరిని అక్కున చేర్చుకునే పరిశ్రమ ఇది. పరిశ్రమలో ఈ స్థానంలో ఉన్నందుకు నా జన్మ సార్ధకమైయిందని భావిస్తాను. ఈ పరిశ్రమలో భాగామవ్వడం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం. కష్టపడి పని చేస్తూ ఒక దీక్ష పట్టుదల వుండే ప్రతి ఒక్కరూ ఒక్కడ సక్సెస్ అవుతారు.

అనుదీప్ జాతిరత్నాలు సినిమా చూశాను. చాలా ఎంజాయ్ చేశాను. అనుదీప్ దగ్గర సహాయ దర్శకులుగా పని చేసిన వంశీ, లక్ష్మీ నారాయణలని దర్శక ద్వయంగా చేసి ఈ సినిమా చేయడం అభినందనీయం. రధన్ అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు మ్యూజిక్ నాకు చాలా నచ్చింది. జాతి రత్నాలులో చిట్టి పాట నాకు చాలా నచ్చింది. సురేఖని చిట్టి అని సరదాగా పిలుస్తాను. ఈ పాట తన కోసం పాడుతుంటాను. ఈ సినిమాలో కూడా మంచి మ్యూజిక్ ఇచ్చుంటారని ఆశిస్తున్నాను. కొత్తవారిని ప్రోత్సహించడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. కొత్తవారిని ప్రోత్సహించడం నాకు ఎనలేని ఎనర్జీ ఇస్తుంది. ఈ ఈవెంట్ కి రావడం గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. శ్రీకాంత్, సంచిత బషు చక్కగా కనిపిస్తున్నారు. సంచిత నవ్వు చాలా అందంగా వుంది.

శ్రీజ చిన్నప్పటి నుండి నాకు తెలుసు. పరిశ్రమలోకి ఆడపిల్లలు వస్తున్నారంటే నేను ఖచ్చితంగా స్వాగతం పలుకుతాను. నిహారిక, సుస్మిత ఇండస్ట్రీకి వస్తానని చెప్పినపుడు వారిని ప్రోత్సహించాను. ఇది చాలా గౌరవమైన పరిశ్రమ. ఇక్కడ దక్కే గౌరవం మరోచోట దొరకదు. ఇలాంటి పరిశ్రమలోకి ఆడపిల్లలు రావాలి. సక్సెస్ కావాలి. శ్రీజకి స్వాగతం పలుకుతున్నాను.కంటెంట్ బావుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లోకి వస్తారు. బింబిసార, సీతారమం, కార్తికేయ 2 ఇవన్నీ మంచి కంటెంట్ తో ప్రేక్షకులని అలరించాయి. కంటెంట్ బావుంటే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లోకి వస్తారు. మంచి కథలు, కంటెంట్ పై ద్రుష్టి పెట్టాల్సిన భాద్యత దర్శకులపై వుంది.

ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన అనుభవం నాకూ వుంది. ఏవీఎం వారి ఎన్టీఆర్ గారు నటించిన ‘రాము’ చిత్రం నెల్లూరు లో మా చుట్టాలు అబ్బాయితో కలసి ఫస్ట్ ఫస్ట్ షో చూడటానికి వెళ్ళా. నేల టికెట్ కి తీసుకెళ్ళాడు. నాగబాబుని తీసుకొని క్యూలో నడుస్తుంటే మధ్యలో క్యూ ఆగిపోయింది. ఇరుకుగోడలు. ఊపిరాగిపోయినంత పనైయింది. ఎదో రకంగా టికెట్ తీసుకొని బయటికి వస్తే.. మా నాన్నగారు ఎదురుగా కనిపించారు. వెనుక అమ్మ వుంది. అంతకుముందు షో ఆయన చూశారు. నేల టికెట్ లో సినిమా చూస్తావా ? అని కొబ్బరి మట్ట తీసి చెత్తకింద కొట్టారు. రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్ళారు. ఇప్పటికీ రాము సినిమా పేరు వింటే వణుకు పుడుతుంది. ఇదీ నా ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం. ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో ఏడిద నాగేశ్వర‌రావు గారి ఆశీస్సులు, ప్రేక్షకుల అభిమానంతో పెద్ద విజయం సాధించాలి” అని కోరారు.

అనుదీప్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా మొదలైనప్పుడే ఏడిద శ్రీరాం గారిని రెండు కండీషన్లు పెట్టాను. ఒకటి కె విశ్వనాద్ గారిని కలిపించాలి. ప్రీరిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గారిని ముఖ్య అతిధిగా తీసుకురావాలని. నాకు చిరంజీవి గారి కామెడీ సినిమాలు అంటే చాలా ఇష్టం. జాతిరత్నాలు సమయంలో ఆయన సినిమాల గురించి చాలా మాట్లాడుకున్నాం. నవీన్ ఏజంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా చిరంజీవి గారి చంటబ్బాయ్ నుండే వచ్చింది. చిరంజీవి గారు కమర్షియల్ సినిమాలు చేస్తూనే కామెడీ సినిమాలు కూడా చేయాలి అని కోరారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారు.. ఐ లవ్ యూ సర్. చిరంజీవి గారు ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. పూర్ణోదయ క్రియేషన్స్ చిన్న పాత్ర వచ్చిన చాలు అనుకునే వాడ్ని. ఇందులో ప్రధాన పాత్రలో నటించడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన అనుదీప్ కి థాంక్స్. వంశీ,లక్ష్మీ కి థాంక్స్. నిర్మాతలకు, మిగతా సాంకేతిక నిపుణులు అందరికీ థాంక్స్ తెలిపారు.

సంచిత మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం, మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది నా మొదటి సినిమా. పూర్ణోదయ క్రియేషన్స్ ఈ సినిమా చేయడం, మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వేడుక రావడం అదృష్టంగా భావిస్తున్నా. మా అమ్మగారు మెగాస్టార్ చిరంజీవి గారికి పెద్ద అభిమాని. ఈ వేడుకలో మా అమ్మగారు కూడా వున్నారు. నా కల నిజమైయినట్లుగా వుంది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చిత్ర నిర్మాతలకు , దర్శకులకు అనుదీప్ గారికి శ్రీకాంత్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీజ మాట్లాడుతూ…మమ్మల్ని బ్లెస్ చేయడనికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోని అందరూ థియేటర్లో చూసి భాగా ఎంజాయ్ చేసి పెద్ద హిట్ ఇవ్వాలి అని కోరారు.

ఏడాది శ్రీరామ్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక కృతజ్ఞతలు. చిన్న సినిమాలని ప్రోత్సహించాలని, మళ్ళీ పూర్ణోదయ రావాలని, మేము కోరగానే ఎంత బిజీలో వుండి కూడా మాకోసం వచ్చారు చిరంజీవి గారు. చిరంజీవి గారు పూర్ణోదయ క్రియేషన్స్ లో స్వయంకృషి, ఆపద్బాంధవుడు, తాయారమ్మ బంగారయ్య(గెస్ట్ రోల్) చిత్రాలు చేశారు. స్వయంకృషి చిత్రానికి నంది అవార్డ్ వచ్చింది. అలాగే ఆపద్బాంధవుడు కూడా రెండోసారి నంది వచ్చింది. ఈ సినిమాకి జాతీయ అవార్డ్ రావడం ఖాయమని భావించిన తరుణంలో నార్త్ ఆదిపత్యం వలన రాలేదు. అయితే అవార్డులు ఆయనకి పెద్ద విషయం కాదు. మన అందరి గుండెల్లో ఆయన చిరకాలం వుంటారు. మెగాస్టార్.. అదే పెద్ద అవార్డ్ ఆయనికి. ఈ వేడుకు వచ్చిన అలీ, శ్రీకాంత్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

రధన్ మాట్లాడుతూ.. అందాల రాక్షసి నా మొదటి సినిమా. అప్పుడు నాకు తెలుగు రాదు. హైదరాబాద్ లో దారి కూడా తప్పిపోయా. చుట్టూ తిరిగి చూస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కనిపించింది. అది నాకు గుడిలా కనిపించింది. ఈ రోజు చిరంజీవి గారి ముందున్న. ఈ మధ్య పెళ్లి చేసుకున్నా. చిరంజీవి గారి దగ్గర మీ అందరి సమక్షంలో ఆశీర్వాదం తీసుకుంటున్న. ఫస్ట్ డే ఫస్ట్ షో చాలా సరదాగా పని చేశాం. నేపధ్య సంగీతం అద్భుతంగా వచ్చింది. అనుదీప్, శ్రీజ, శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. చిరంజీవి గారిని ఠాగూర్ షూటింగ్ జరుగుపుతున్న దూరంగా చూశాను. మళ్ళీ ఆయన్ని ఇంత దగ్గరగా చూడటానికి 19 ఏళ్ళు పట్టింది. చిరంజీవి గారిని నుండి చాలా స్ఫూర్తిని పొందుతాను. అలీ,శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు. నిర్మాతలు శ్రీజ, శ్రీరామ్ గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ చిత్రానికి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా అనుదీప్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. అనుదీప్ లేకపోతే ఈ సినిమా లేదు అన్నారు.

వంశీధర్ గౌడ్.. చిరంజీవి గారిని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు ఆయన ఎదురుగానే మాట్లాడుతుంటే భయంగా వుంది. అలీ, శ్రీకాంత్ గారికి కృతజ్ఞతలు. మా అమ్మ నాన్నలకు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి అన్నయకి నమస్కారం. పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్ అంటే ఒక క్లాసిక్. ఏడిద నాగేశ్వర‌రావు గారు చరిత్రలో నిలిచిపోయే చిత్రాలు తీశారు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని శ్రీ‌జ నిర్మాతగా ఫస్ట్ డే ఫస్ట్ షో నిర్మించారు. శ్రీజ, శ్రీరాం నాకు ఎప్పటి నుండో తెలుసు. మేము స్నేహితుల్లా వుంటాం. ఈ సినిమా మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.

అలీ మాట్లాడుతూ.. ఈ వేడుకకు విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి అన్నయకి నమస్కారం. మా అమ్మ నాకు జన్మనిస్తే పూర్ణోదయ క్రియేషన్స్ నాకు మరో జన్మనిచ్చింది. ఏడాది నాగేశ్వర్ రావు గారి కుటుంబం ఆశీర్వాదంతో రోజు ఈ స్థాయిలో వున్నా. ఫస్ట్ డే ఫస్ట్ షో సీతాకోక చిలుక లాంటి పెద్ద విజయం సాధించాలి. ఈ మూవీ ని దీవించడానికి చిరంజీవి అన్నయ్య వచ్చారు. ఆయన చేతులమీద ఏం చేసిన సూపర్ హిట్. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x