Sunday, March 22, 2026

పృధ్వీ షాపై పగ తీర్చుకున్న కేకేఆర్ బౌలర్.. మ్యాచ్ ముగియగానే మీదపడి..

ఐపీఎల్‌-2021 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్ పృధ్వీషాపై కోల్‌కతా బౌలర్ శివమ్ మావి పగ తీర్చుకున్నాడు. అయితే బంతితోనో, బ్యాట్‌తోనో కాదు.. ఏకంగా మీదపడి అతడి మెడను ఒడిసిపట్టుకున్నాడు. గట్టిగా బిగించి పట్టుకోవడంతో పృధ్వీషా పెద్దగా అరిచేశాడు కూడా. మ్యాచ్‌ పూర్తవ్వగానే శివం మావి.. పృథ్వీ షా వద్దకు రావడం, అతడి బ్యాటింగ్‌ను అభినందించడం, ఆ తర్వాత అతడిని ఆలింగనం చేసుకుని వెంటనే అతడి మెడను, చేతిని బలంగా నొక్కి పట్టడం అంతా కెమెరాల్లో రికార్డయింది. అయితే ఇదంతా వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగా సరదాగా చేసిన చర్యే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గురువారం నాటి మ్యాచ్‌లో పృథ్వీ షా విశ్వరూపం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. కేకేఆర్‌ బౌలర్‌ శివం మావి వేసిన తొలి ఓవర్‌లోనే వరుసగా ఆరు బౌండరీలు బాది అతడికి చుక్కలు చూపించాడు. ఇక మ్యాచ్‌లో 41 బంతుల్లో 82 పరుగులు చేసిన షా అద్భుతమైన స్ట్రైక్‌రేటు నమోదు చేసి, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డునూ దక్కించుకున్నాడు. షా సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఢిల్లీ మెరుగైన స్కోరు నమోదు చేసి, కోల్‌కతాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

కాగా.. తాను వేసిన మొదటి ఓవర్లోనే పృధ్వీ షా వరుసగా ఫోర్లు బాదడంతో శివం మావి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆ తర్వాత కూడా మిగతా బౌలర్లను షా అదే తరహాలో పూనకం వచ్చినట్లు ఆడేశాడు. దీంతో కేకేఆర్‌పై ఢిల్లీ సునాయాసమైన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ ముగిశాక షాపై మావి స్వీట్‌ రివేంజ్‌ తీర్చుకున్నాడు. శభాష్‌ అంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటూనే.. ‘నా బౌలింగ్‌లోనే అన్ని బౌండరీలు బాదేస్తావా’ అన్నట్లుగా.. పృథ్వీ షా మెడను, చేతిని నొక్కిపట్టాడు. ఇక శివం ఇలా చేయగానే, పృధ్వీ నొప్పి భరించలేనన్నట్లుగా అతడిని విడిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ‘ఒక్కసారి మ్యాచ్‌ అయిపోయిందంటే.. స్నేహం తప్ప ఆటగాళ్ల మధ్య వైరాలు ఉండవు. ఐపీఎల్‌లో ఉన్న బ్యూటీ అదే’ అని ఈ వీడియోకు ఓ అందమైన కామెంట్‌‌ను కూడా జతచేసింది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -