Friday, November 1, 2024

రైలుబోగీలాంటి బైక్.. పెట్రోల్ ధరలకు పెద్ద విరుగుడు.. ఏం ఐడియా సర్‌జీ!

ఓ వ్యక్తి తన బైకుపై పది మందికి పైగా జనాలను తీసుకెళుతున్నాడు. అదేంటి..? ఒక్క బైక్‌పై అంతమంది ఎలా పట్టారని అనుకుంటున్నారా..? ఈ వీడియో చూడండి మీకే అర్థమైపోతుంది. బైక్ వెనక వైపు ట్రాలీ లింక్ చేసి ఆ ట్రాలీలో మెత్తటి కుషన్ పరుపు వేశాడు. ఇక అందులో కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి జాలీగా తీసుకెళుతున్నాడు. అలాగే బైక్‌ వెనుక ఖాళీగా ఉన్న సీట్లో మరో మహిళను కూర్చోబెట్టుకుని ప్రయాణిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆన్‌లైన్‌లో ప్రతి రోజూ వేల వీడియో చక్కర్లు కొడుతుంటాయి. సోషల్ మీడియా ఈ వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్వులు పూయిస్తే.. మరికొన్ని నమ్మశక్యంకాని విధంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇక ఈ వీడియోల ద్వారా వైరల్ అయ్యేందుకు కొందరు చేసే విచిత్రమైన పనులకు, వారి క్రియేటివ్ ఐడియాలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతుంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఒక్క బైక్‌పై పది మందిని తీసుకెళుతూ పెట్రోల్ కోసం ఓ పెట్రోల్ పంప్ వద్ద ఆగిన బైక్ వీడియో ఇది. ఇది చూసిన నెటిజన్లకు నోట మాట రావడం లేదు.

పెట్రోల్ కోసం ఓ పెట్రోల్ బంకు వద్దకు అతడు రావడంతో అక్కడి వారు అతడి క్రియేటివ్ ఐడియాకు హాట్సాఫ్ చెప్పారు. మరికొంతమంది అతడి బైక్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రాలీలో నలుగురు పిల్లలు, మరో నలుగురు మహిళలు మొత్తం ఎనిమిది మంది కూర్చున్నారు.

కాగా.. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచినప్పటి నుంచి ఆన్‌ లైన్‌లో విపరీతంగా మీమ్స్, ట్రోల్స్ షేర్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ వీడియో కూడా బయటకు రావడంతో నెటిజన్లు దీనిని తెగ షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో అతడి ఐడియా అదిరిపోయిందని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు వాట్ యాన్ ఐడియా సర్ జీ అని కితాబిసతున్నారు. కానీ, కొందరు మాత్రం ఇలా ప్రయాణం చేయడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x