మైదానంలో కోహ్లీ ఎలా ఉంటాడో అందరికీ తెలుసు. అతడి ఎంత ఎగ్రెసివ్‌గా ఉంటాడో, ఎంత గొప్పగా ఆడతాడో అంతే ఉద్రేకంగా ఉంటాడు. ప్రత్యర్థి వికెట్ దక్కినప్పుడు పూనకం వచ్చినట్లు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటాడో, తన వికెట్ కోల్పోయినప్పుడు అంతకు రెట్టింపు ఫ్రస్ట్రేషన్‌తో ఊగిపోతాడు. ఈ విధానాలే కోహ్లీకి అనేకసార్లు చిక్కులు తెచ్చిపెట్టాయి. తాజాగా మరోసారి అలాంటి ఇబ్బందుల్లోనే కోహ్లీ చిక్కుకున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ చేసిన ఓ పని అంపైర్లకు కోపం తెప్పించింది. దీంతో వారు అతడికి వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ కోహ్లీ ఏం చేశాడు..? అంపైర్లు అతడిపై ఎలాంచి చర్యలు తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ మధ్య బుధవారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై కోహ్లీ సేన ఉత్కంఠ విజయం సాధించింది. అయితే ఆర్సీబీ బ్యాటింగ్ కూడా అంత గొప్పగా సాగలేదు. మ్యాక్స్‌వెల్ మినహా.. మిగతా బ్యాట్స్‌మెన్ అంతా అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంతో ఈ సీజన్ ఐపీఎల్ లోనే తొలిసారి 150 మార్కు కూడా దాటని జట్టుగా నిలిచింది. అయితే ఈ క్రమంలోనే ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తాను ఔటవడాన్ని జీర్ణించుకోలేక పెవిలియన్ వెళ్తూ అడ్వర్టైజ్‌మెంట్ కుషన్, కుర్చీని బ్యాట్‌తో కొట్టాడు. దీంతో మ్యాచ్ రిఫరీ ఫరీ వెంగలిల్ నారాయణ్ కుట్టీ మందలించాడు.
కోహ్లీ చేసిన ఈ చర్య.. ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘన కిందకు రావడంతో అతన్ని నిర్వహాకులు మందలించారు. ఐపీఎల్ నియమావళిలోని లెవల్ 1 నిబంధనల్లో 2.2 ఉల్లంఘన కిందకు కోహ్లీ చర్య వస్తుందని, క్రికెట్ ఎక్విప్‌మెంట్, గ్రౌండ్ ఎక్విమెంట్‌ను పాడుచేయ కూడదని ఇందులో స్పష్టంగా ఉంటుందని ఉంటుందని అంపైర్లు తెలిపారు. అయితే కోహ్లీకి ఎలాంటి జరిమానా విధించలేదని, కేవలం మందలింపుతోనే విడిచిపెట్టామని తెలిపారు.