Tuesday, March 24, 2026

ఐపీఎల్ 2021: ఢిల్లీపై రాజస్థాన్‌ విజయం

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మరో ఉత్కంఠ భరిత మ్యాచ్ అభిమానులకు క్రికెట్ ఆకలి తీర్చింది. రాజస్థాన్ రాయల్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ల ముందు ఢిల్లీ తలొంచింది. రాజస్థాన్ రాయల్స్ అనూహ్య విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. ఢిల్లీ బౌలర్ల ధాటికి విలవిల్లాడిపోయింది. వీరి ధాటికి రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ అందరూ వచ్చినట్లే వచ్చి పెవిలియన్‌కు క్యూ కట్టారు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఓపెనర్లు జోస్ బట్లర్(2), మనన్ వోహ్రా(9)ల వికెట్లు తీసి ఆదిలోనే దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ (4), శివమ్ దూబే (2), రియాన్ పరాగ్ (2) కూడా సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుట్ అయిపోయారు. దీంతో జట్టు 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ (43 బంతుల్లో 62), రాహుల్ తెవాటియా (19) వీరిద్దరూ అవుట్ కావడంతో మళ్లీ విజయం రెండు జట్లతో దోబూచులాడింది. చివర్లో క్రిస్ మోరిస్ 18 బంతుల్లో 4 సిక్సర్లతో 36 పరుగులు చేసి చేయడంతో రాజస్థాన్ విజయం దక్కించుకుంది. ఢిల్లీ బౌలర్లో ఆవేశ్‌ ఖాన్‌ 3, వోక్స్‌ 2, రబాడ 2 వికెట్లు తీశారు.అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో రిషబ్‌ పంత్‌ 51 పరుగులు చేయగా.. టామ్‌ కరన్‌ 21, లలిత్‌ యాదవ్‌ 20 పరుగులు సాధించారు. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో ఉనాద్కట్‌ 3, ముస్తాఫిజుర్‌ 2, మోరిస్‌ ఒక వికెట్‌ తీశాడు.

ఇదిలా ఉంటే ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్‌లో తొలి విజయం సాధించి పాయింట్ల ఖాతా తెరిచింది. రెండు మ్యాచ్‌లలో ఓ విజయంతో 2 పాయింట్లు నమోదు చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ సీజన్లో 2 మ్యాచ్‌లు ఆడి ఓ మ్యాచ్ గెలిచి, రెండో మ్యాచ్‌లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో 2 పాయింట్లతోనే నిలిచిపోయింది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -