Sunday, March 22, 2026

జగన్‌కు అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరికింది.. పర్యటన షెడ్యూల్ ఇదే

అమరావతి: సీఎం జగన్ ఢిల్లీ పయనమవుతున్నారు. గురువారం జగన్ ఢిల్లీ వెళ్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా సోమవారం వెళ్లాలని అనుకున్నారు. అయితే కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షాతో అపాయింట్‌మెంట్ ఖారారు కాకపోవడంతో పర్యటన రద్దయింది. కానీ తాజాగా అపాయింట్‌మెంట్ దొరకడంతో జగన్ ఢిల్లీకి బయలుదేరేందుకు రెడీ అయ్యారు.

గురువారం ఉదయం 10:30 గంటలకు ఆయన ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు జగన్ వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం 1:40 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. రాత్రి 9 గంటలకు అమిత్‌ షాతో జగన్ భేటీకానున్నారు. గురువారం రాత్రి ఢిల్లీలోనే బస చేసి శుక్రవారం మధ్యాహ్నం 12:30కి విజయవాడకు జగన్‌ చేరుకుంటారు.

కాగా.. ఢిల్లీ పర్యటనలో జగన్.. కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను కూడా కలువనున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, విభజన సమస్యలపై వారితో చర్చించనున్నారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -