ఐపీఎల్‌లో ప్రతి ఆటగాడూ పరుగుల వరద పారించాలని అనుకుంటాడు. భారీ స్కోర్లు చేయాలని అనుకుంటారు. అయితే కొన్నిసార్లు ఆటగాళ్లు మంచి ఫాంలో ఉన్నా.. వారు భారీ స్కోర్లు చేసే పరిస్థితి ఉండదు. అలాంటి ఆటగాళ్లు ధారాళంగా పరుగులు చేయగలిగినా.. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం ఉండదు. ఇలాంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో చాలా మంది ఉంటారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ కూడా ఇలాంటి ఆటగాడే. భారీ షాట్లు ధారాళంగా ఆడగలిగినా.. పెద్ద స్కోర్లు చేయగలిగే అవకాశం అతడికి ఉండడం లేదు. దీనిపైనే ఇంతకుముందు రియాన్ పరాగ్‌కు, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య జరిగిన సంభాషణ తాజాగా వెలుగులోకొచ్చింది. అందులో తనకు ఆరెంజ్ క్యాప్ దక్కడం అసాధ్యమని కోహ్లీ చెప్పిన విషయాన్ని రియాన్ బయటపెట్టడం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రియాన్‌తో చిట్ చాట్ సందర్భంగా కోహ్లీ..‘అరె.. రియాన్.. నువ్వు బ్యాటింగ్‌కు వచ్చేది ఐదు లేదా ఆరో స్థానం. ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే ఆరెంజ్ క్యాప్ అందుకోవడం నీవల్ల కాదు. ఆ సమయంలో నీ తరపు నుంచి జట్టుకు 20- 30 పరుగులు చేయడంపైనే దృష్టి పెట్టాలి. అందుకే ఆరెంజ్ క్యాప్ గురించి మర్చిపో’ అని చెప్పినట్లు రియాన్ వెల్లడించాడట. అప్పటినుంచి తన ఆలోచన మార్చుకొని మ్యాచ్‌కు అనుగుణంగా పరుగులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రియాన్ వెల్లడించాడు.
రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా కోహ్లీ చెప్పినట్లే తాను ఐదు లేదా ఆరవ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని, సహజంగా ఆ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే జట్టుకు అవసరమైన పరుగుల కోసం ఆడాల్సి వస్తుంది తప్ప భారీ స్కోర్లు చేసే అవకాశం ఉండదు. ఈ క్రమంలోనే కోహ్లీ మాటలను గుర్తుంచుకుని జట్టు కోసం ఆడడంపైనే దృష్టి పెడతున్నానని రియాన్ చెప్పుకొచ్చాడు.
కాగా.. రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ ఐపీఎల్ 14వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 11 బంతుల్లోనే 25 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అలాగే ఆ మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ సంజూ శామ్సన్ సెంచరీతో విజృంభించి ఆడినా జట్టుకు విజయం దక్కలేదు. కానీ, నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం రాజస్థాన్ విజయం సాధించింది. తొలుత బౌలర్లు రాణించడంతో ఢిల్లీ జట్టును 147 పరుగులకే కట్టడి చేయగలిగింది రాజస్థాన్. ఆ తర్వాత 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కూడా 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కోల్పోయింది. అయితే మిడిలార్డర్‌లో డేవిడ్ మిల్లర్(64) ఆదుకోవడం, చివర్లో క్రిస్ మోరిస్(36) మెరుపులు పెరిపించడంతో రాజస్థాన్ విజయం సాధించింది.