“మౌనమా ఓడిపో.. ఓనమాలాటలో
దూరమా చేరిపో.. చేతుల గీతలో“ అని ప్రేయసి ప్రేమికుడి గుండెల్లోని ప్రేమ గురించి తపిస్తుంటే…
బతకు బడి ప్రేమగా బడి పలుకు రాసుకో
నిచ్చెలి ముచ్చటె దాచుకోగా.. “ అంటూ ప్రేమికుడు తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు.
అసలు ప్రేమికుడు, ప్రేయసి ఎవరు? వారి మధ్య ప్రేమ ఎందుకు.. ఎలా పుట్టింది? అనే విషయాలు తెలియాలంటే మాత్రం `బలమెవ్వడు` సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు.
ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న “బలమెవ్వడు” సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు “బలమెవ్వడు” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి మెలోడీ సాంగ్‌ను లిరికల్ వీడియో పాటగా చిత్ర యూనిట్ గురువారం విడుదల చేశారు. కళ్యాణ చక్రవర్తి రాసిన ఈ పాటను, అనురాగ్ కులకర్ణి, సాహితి చాగంటి పాడారు.
మెలోడీ సాంగ్స్‌కు ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసి మెలోడి బ్రహ్మ అనే పేరుని తన పేరు ముందు చేర్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకు సంగీత సారథ్యాన్ని వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ టీజర్‌కు, మరకత మణి ఎం.ఎం.కీరవాణి పాడిన టైటిల్ సాంగ్.. `బలమెవ్వడు`కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాత ఆర్.బి.మార్కండేయులు తెలిపారు.
నటీనటులు :
ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్, వివేక్ త్రివేది, అప్పారావు, ఐ డ్రీమ్ అంజలి, మణి మహేష్, శ్రావణ్ భరత్
సాంకేతిక నిపుణులు :
రచన, దర్శకత్వం: సత్య రాచకొండ
నిర్మాత: ఆర్.బి.మార్కండేయులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధృవన్ కటకం
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సంతోశ్ శక్తి, గిరి.పి
ఎడిటర్: జెస్విన్ ప్రభు
ఫైట్స్: శివరాజ్
కాస్ట్యూమ్స్: హరీషా రాచకొండ
పాటలు: కళ్యాణ్ చక్రవర్తి