“పట్టు చీరల తళతళలు.. పట్ట గొలుసుల గళగళలు
పూల చొక్కాల రెపరెపలు.. సిల్కు పంచెల టపటపలు
కాసుల పేరుల ధగధగలు… కాఫీ గ్లాసుల బుగబుగలు
మామిడాకుల మిలమిలలు… కొబ్బరాకుల కళకళలు
గట్టిమేళాల డమడమలు… వంటశాలలో గుమగుమలు
అన్ని అన్ని అన్నీ కలిపితే ..పిప్పి పిప్పి.. పెళ్లి సందడి… డుడ్డుం డుడ్డుం పెళ్లి సందడి“
అంటూ పెళ్లి సందడిలో ఉండే సందడి గురించి హీరో హీరోయిన్లు పాడుతూ ఆడుతున్నారు. అసలు వాళ్లు అలా సందడి చేయడానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే `పెళ్లి సందD` సినిమా చూడాల్సిందే అని అంటున్నారు మేకర్స్…
ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందD’తో మరోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆసక్తికరమైన విషయమేమంటే.. కె.రాఘవేంద్రరావు ఈ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ఈయన వశిష్ట అనే పాత్రలో మెప్పించబోతున్నారు. అలాగే ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో కె.రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాటి `పెళ్లిసందడి`లో శ్రీకాంత్ హీరో అయితే నేటి ‘పెళ్లిసందD’లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో అవడం విశేషం. శ్రీలీల హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదలకానుంది.
సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రాఘవేంద్రరావు ప్రోమో, హీరో, హీరోయిన్ ప్రోమోలు, సాంగ్స్ అన్నింటికీ ప్రేక్షకుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఈ బజ్‌ను మరింత పెంచడానికి సినిమా టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కోలాహలంగా జరిగే పెళ్లిలో ఎలాంటి సందడి ఉంటుందనే విషయాన్ని ఈ పాట ద్వారా వివరించారు. పాట కలర్‌ఫుల్‌గా ఉంది. అలాగే హీరో రోషన్, హీరోయిన్ శ్రీలీల జంట, వారి మధ్య కెమిస్ట్రీ చాలా క్యూట్‌గా ఎలివేట్ అవుతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకురాలు గౌరి రోణంకి తెలియజేశారు.
నటీనటులు:
రోషన్, శ్రీలీల, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, సత్యంరాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, అన్నపూర్ణ, జాన్సి, ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి తదితరులు..
సాంకేతిక వర్గం:
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్త, చంద్రబోస్
సినిమాటోగ్రఫి: సునీల్ కుమార్ నామ
ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె,
మాటలు: శ్రీధర్ సీపాన
ఫైట్స్: వెంకట్
కొరియోగ్రఫి: శేఖర్ వీజే
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వి. మోహన్ రావు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబా కోవెలమూడి
సమర్పణ: కె. కృష్ణమోహన్ రావు
నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వ పర్యవేక్షణ: కె. రాఘవేంద్రరావు బి.ఎ
దర్శకత్వం: గౌరీ రోణంకి.