Sunday, March 22, 2026

ఆనందయ్య మందు వాడా.. కరోనా రాలేదు: జగ్గూ భాయ్

కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై విలక్షణ నటుడు జగ్గూ భాయ్ మొదటి నుంచి మద్దతుగానే మాట్లాడుతున్న విషయం తెలిసిందే. తాను ఆనందయ్య మందు వాడానని, తనకు కరోనా రాలేదని చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఏపీ సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందిన ఆనందయ్య మందుపై ఆది నుంచే అనేక రూమర్లు వైరలయ్యాయి. ఈ మందు వల్ల కరోనా తగ్గే అవకాశం లేదని కొందరంటే.. మరికొందరేమో ఈ మందు తీసుకుంటే బ్లాక్ ఫంగస్ వస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే ఇటీవల ప్రభుత్వ ఆమోదం లభించడంతో కొంతమేర ఈ రూమర్లకు అడ్డుకట్ట పడింది.

ఇక తాజాగా జగపతిబాబు మరోసారి ఆనందయ్య మందుకు తన మద్దతు తెలిపాడు. ఆ మందును తాను ఎప్పుడో వాడానని, ఆయుర్వేదం హానీ చేయదనే విషయాన్ని తాను బలంగా నమ్ముతానని చెప్పాడు. ఇటీవల జగ్గూ భాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆనందయ్య ఆయుర్వేద మందుని వాడిన వారిలో తాను ఒక‌డినని. తనకు క‌రోనా రాలేదని స్ప‌ష్టం చేశారు.

‘ఆయుర్వేదం మందులను ప్రకృతి సహాజమైన ఔషధాలతో తయరు చేస్తారు. అలాంటి ఔషధం ఎలాంటి హానీ చేయ‌దని నేను విశ్వ‌సిస్తున్నాను. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ఆనందయ్య మందు విషయంలో చాలామంది అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఓ అభిప్రాయానికి వచ్చాను. ఈ ఔషధానికి సైడ్ ఎఫెక్ట్స్‌ కచ్చితంగా ఉండవు’ అని జగ్గూభాయ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాను ఆనందయ్య మందుని వాడానని, ఇప్పటివరకు తనకు కోవిడ్ రాలేదని, చాలా హ్యాపీగా ఉన్నానని వెల్లడించాడు. ఆనందయ్య మందు వాడానని జగ్గూ భాయ్ సైతం చెప్పడం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -