Sunday, March 22, 2026

రోహిత్ భాయ్ వల్ల ఫ్లైట్‌లో నిద్ర చెడింది: సిరాజ్

లండన్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీమిండియా రెండు రోజుల క్రితం ఇండియా విమెన్స్ జట్టుతో కలిసి తొలిసారి ఒకే విమానంలో ప్రయాణించింది. ఈ క్రమంలోనే గురువారం ఇంగ్లండ్ చేరుకుంది. క్రికెటర్లంతా విమానాల్లో సందడి సందడిగా గడుపుతూ ఇంగ్లండ్ ప్రయాణాన్ని ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్విటర్​లో షేర్‌ చేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ చేరుకున్న తరువాత కొందరు టీమిండియా క్రికెటర్లు.. విమానంలో తాము ఎలా గడిపామో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

తాజాగా భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్.. విమానంలో రోహిత్ చేసిన పనికి తాను నిద్ర కూడా పోలేకపోయానని చెప్పుకొచ్చాడు. ప్రశాంతంగా నిద్రపోతుంటే రోహిత్ శర్మ వచ్చి లేపాడని, ఆ తర్వాత నిద్ర కూడా పట్టలేదని సిరాజ్ చెప్పాడు. ‘ఇప్పుడే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాం. హోటల్‌కు వెళ్లడానికి రెండు గంటలు సమయం పడుతుంది. విమాన ప్రయాణంలో రెండు గంటలు మంచిగా నిద్రపోయాను. ఆ తర్వాత రోహిత్ భాయ్ వచ్చి నిద్ర లేచేవరకు వదిలిపెట్టలేదు. అంతే మళ్లీ నిద్ర రాలేదు. సరిగ్గా విమానం ల్యాండ్ అయ్యే 2 గంటల ముందు మళ్లీ కాస్త నిద్రపోయా. నిన్న కాస్త ఎక్కువగానే రన్నింగ్ సెషన్‌లో పాల్గొన్నాం. దాంతో నేను చాలా అలసిపోయాను’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు.

కాగా.. ఈ వీడియోపై ఫ్యాన్స్ స్పందిస్తూ.. సిరాజ్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘అంత గొప్ప పర్యటనలో ఎలా నిద్రపోతావ్ సిరాజ్..?’, అంతా సరదాగా గడుపుతుంటే నువ్వు నిద్ర పోవడం సరికాదు. రోహిత్ మంచి పని చేశాడు.!’ అని కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -