అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని సవాల్ చేస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో దాఖలు చేసినపిటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర సర్కార్‌కు షాకిచ్చింది. గుజరాత్‌కు చెందిన పాల ఉత్పత్తుల కంపెనీ అమూల్ ప్రభుత్వానికీ కీలక ఆదేశాలిచ్చింది. అమూల్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ నిధులు వినియోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అమూల్‌తో కుదిరిన ఎంవోయూపై ఈ నెల 14 వరకు ఎలాంటి నిధులు ఖర్చు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ నిధులను ఏపీడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ సీఎం జగన్ అధ్యక్షత కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రఘురామ తన పిటీషన్ ద్వారా హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించి, రద్దు చేయాలని కోరారు. దీనిపై నేడు(శుక్రవారం) విచారణ జరిగింది. రఘురామ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.విచారణ అనంరతం నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు.. అమూల్‌కి మధ్యంతర నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అమూల్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై ఎలాంటి నిధులు ఖర్చు చేయొద్దని ప్రభుత్వానికి సైతం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ వరకు కేసు విచారణను హైకోర్టు వాయిదా వేస్తున్నామని, అప్పటివరకు ఎలాంటి ప్రభుత్వ నిధులనూ అమూల్ కోసం వెచ్చించవద్దని ఆదేశాలు జారీ చేసింది.