Wednesday, January 22, 2025

వైజాగ్‌లో భారీగా ‘ది హ్యాండ్‌‌క్రాఫ్టర్స్ – ఏ కలెక్టివ్ ఆఫ్ ఆర్టిసన్స్’ ఎగ్జిబిషన్

మన దేశంలో మరియు మన రాష్ట్రంలో చేనేత వస్త్రాలకు ప్రత్యేక స్థానం ఉంది: మేయర్ గోళగాని హరి వెంకటా కుమారి
వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కల్పించే రంగం చేనేత రంగం: భాజపా ప్ర‌ధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి

విశాఖ‌ప‌ట్నంలోని నోవాటెల్ హోట‌ల్‌లో శుక్రవారం.. విశాఖపట్నం మేయర్ గోళగాని హరి వెంకటా కుమారి, భాజపా ప్ర‌ధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి, సినీ నిర్మాత నాగ‌సుశీల మరియు నిర్వహకులు యార్ల‌గ‌డ్డ ర‌జ‌నీ కలిసి ‘ది హ్యాండ్‌‌క్రాఫ్టర్స్ – ఏ కలెక్టివ్ ఆఫ్ ఆర్టిసన్స్’ పేరుతో జరుగుతున్న ప్రదర్శను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం మేయర్ గోళగాని హరి వెంకటా కుమారి మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్ర‌ఖ్యాతిగాంచిన చేనేత ఉత్ప‌త్తుల‌ను ఒక చోట‌కి చేర్చి త‌ద్వారా చేనేతక‌ళాకారుల‌కు చేయూత‌నివ్వ‌డంతోపాటు చేనేత ఉత్ప‌త్తుల‌ను క‌ళాభిమానుల చెంత‌కు చేర్చేందుకు రజని తోడ్పాటుని అందించడం అభినందనీయమని అన్నారు.

దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. మన భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక ఉపాధి కలిపించే రంగం చేనేత రంగం. మన దేశములో, రాష్ట్రంలో ప్రత్యేకమైన నైపుణ్యత ఉన్నటువంటి నేపథ్యం మనది. చేనేత ఉత్ప‌త్తుల‌కు ఎప్పుడూ ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఏళ్లు గ‌డిచినా, ప్యాష‌న్ మారినా, చేనేత‌కు ఉండే ప్రాధాన్య‌త‌, ప్రాముఖ్య‌త అలానే ఉంటుంది. చేనేత ఉత్ప‌త్తుల‌ను ప్రేమించే క‌ళ‌కారులు నిత్యం వాటి కొనుగోలుకే ఆస‌క్తి చూపుతారు. అలాంటి చేనేత ఉత్ప‌త్తుల‌తో కూడిన ప్ర‌ద‌ర్శ‌న‌ను యార్ల‌గ‌డ్డ ర‌జ‌నీగారు ‘ది హ్యాండ్‌‌క్రాఫ్టర్స్ – ఏ కలెక్టివ్ ఆఫ్ ఆర్టిసన్స్’ పేరుతో మన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది.. అని అన్నారు.

యార్ల‌గ‌డ్డ ర‌జ‌నీ మాట్లాడుతూ.. మేము భారతదేశం మొత్తం ఈ చేనేత ప్రదర్శన పెడుతున్నాము. శుక్రవారం విశాఖపట్నంలో ఒకే ఒక్క రోజు మాత్రమే జరిగే ప్ర‌ద‌ర్శ‌న‌కు చేనేత ఉత్ప‌త్తుల‌కు, క‌ళాకారుల‌కు.. దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన ప్రముఖ నేత కార్మికులు, డిజైనర్లు మరియు క్రాఫ్ట్ తయారీదారులు తమ కళల‌ను, ఉత్ప‌త్తుల‌ను ఇక్క‌డ ఏర్పాటు చేశారు. ప్ర‌ధానంగా ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో పటాన్ పటోలా, కంచి, బనారసి, జమ్దానీ, గద్వాల్, కోట, మంగళగిరి చీరలు మరియు డ్రెస్ మెటీరియల్స్, దుపట్టాలు, పొట్లీలు, బ్యాంగిల్స్, హోమ్ లినెన్ బ్యాగులు మరియు డ్రెస్‌లను ప్రదర్శించనున్నాము. అలాగే, అనేక రకాల చేతితో తయారు చేసిన నగలు, విలువైన రత్నాలు మరియు వజ్రాలు ఏర్పాటు చేశాము.

యార్ల‌గ‌డ్డ ర‌జ‌నీ గురించి..
గ‌త 32 సంవ‌త్స‌రాలుగా ర‌జ‌నీ యార్ల‌గ‌డ్డ ఈ ప‌రిశ్ర‌మ‌లో సేక‌రించిన ఎన్నో ఉత్ప‌త్తుల‌తో కూడిన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇక్క‌డ నిర్వ‌హిస్తున్నారు. వస్త్రాల పట్ల ఆమెకున్న అభిమానం మరియు అభిరుచి ఆమె బ్రాండ్ ‘రజినీ శారీస్’ పేరుతో సముచిత స్థానాన్ని ఏర్పరచుకొన్నారు. సాంప్రదాయ చేనేతకు మద్దతునిస్తూ పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో ఆమె ముందున్నారు. చేనేత ఉత్ప‌త్తుల త‌యారీకి దేశంలో ఎన్నో ప్రాంతాలు పేరుగాంచాయి. అలాంటి గొప్ప ఉత్ప‌త్తుల‌ను రూపొందించే చేనేత కార్మికుల‌ను, వారి క‌ళ‌లను ఒక వేదిక‌పైకి తీసుకొచ్చందుకే ఈ ప్ర‌య‌త్నం. త‌ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని జాతీయ పటంలో నిలిపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x