Sunday, March 22, 2026

చిరు వెంట నడిచే వారెవరూ లేరా..!?

తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విషయాలపై అయినా సరే మొట్ట మొదట టాలీవుడ్ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ఉంటారు. తుఫానులు, నవ్యాంధ్రకు మూడు రాజధానులు, కరోనా సమయంలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సార్లు ఇండస్ట్రీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.. అందరూ తమ వంతుగా.. తమకు తోచినంతగా సాయం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ అయిన ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ’ను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ స్పందించి.. తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టారు. అంతేకాదు.. పార్టీలకు అతీతంగా కదలిరావాలని పిలుపునివ్వడంతో చిరంజీవి కూడా ఉద్యమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు పరోక్షంగా వచ్చినట్లే.

మరోవైపు.. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆ నాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడల మీద ‘విశాఖ ఉక్కు సాధిస్తాం’ అనే నినాదాన్ని రాశాం. 35మంది పౌరులతోపాటు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమం త్యాగం ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పడింది’ అని ట్వీట్ చేస్తూ చిరు ఒకింత ఎమోషనల్ అయ్యారు.

అయితే.. చిరు తన మద్దతు ప్రకటించిన తర్వాత కూడా చిరు వెంట నడిచే వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. ఇన్నిరోజులుగా ఉద్యమాలు జరుగుతున్నా.. ఇప్పటి వరకూ కనీసం మెగాస్టార్ ప్రకటన తర్వాత కూడా ఒక్కరూ కూడా రియాక్ట్ అవ్వకపోవడంపై సోషల్ మీడియాలో, మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. సినిమా షూటింగ్‌లకు ఏపీ ముఖ్యంగా వైజాగ్ లాంటి మాత్రం కావాలి.. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం స్పందించడానికి నోరుండదా..? అంటూ టాలీవుడ్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మిగతా సినీ ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ మాత్రం చాలా విచిత్రంగా ఉంటుందన్నది జగమెరిగిన సత్యమే. ఇకనైనా ‘వుయ్ స్టాండ్ విత్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’ అని కనీసం సోషల్ మీడియాలో అయినా ప్రకటిస్తారో లేదో చూడాలి.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -