Sunday, March 22, 2026

సిక్సులతో విరుచుకుపడ్డ ధోనీ.. ఐపీఎల్ ముందే ఇలా ఉంటే ఇక..

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. బంతిబంతినీ బౌండరీ దాటేలా బాదుతూ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. ధోనీ బ్యాటింగ్ చూస్తే మళ్లీ ఒకప్పటి ధోనీని చూసినట్లు అనిపించింది. అదేంటి ఐపీఎల్ ఇంకా మొదలు కాలేదు కదా..? మరి ధోనీ సిక్సులు ఎక్కడ కొట్టాడు..? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ధోనీ సిక్సులు కొట్టింది ఐపీఎల్ కోసం చేస్తున్న ప్రాక్టీస్ సెషన్‌లో. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఐపీఎల్-14 సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ధోనీ ఈ మధ్యనే చెన్నై చేరుకున్నాడు. ఆటగాళ్ల కోసం చెన్నై ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్‌లోనే ధోనీ రెచ్చిపోయాడు.

మొదట కొన్ని బంతులను డిఫెండ్ చేసుకున్న ధోనీ.. ఆ తర్వాత సిక్సుల మోత మోగించాడు. ప్రతి బంతినీ ఎడాపెడా సిక్సర్లు బాదుతూ బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

ఇదిలా ఉంటే గతేడాది చెన్నై జట్టు దారుణ ప్రదర్శన చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా గ్రూప్ దశలోనే వెనుతిరిగింది. పాయింట్ల పట్టికలో ఏకంగా ఏడో స్థానానికి పడిపోయింది. దీంతో ఈ ఏడాది సత్తా చాటాలని, కప్పు కూడా పట్టేయాలని పట్టుదలతో ఉంది.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -