Wednesday, January 22, 2025

ధోనీ, కోహ్లీ, రోహిత్‌లకు షాకిచ్చి పంత్‌కు కెప్టెన్సీ ఇచ్చిన కామెంటేటర్

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో కేకేఆర్‌, ఢిల్లీ, సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులో ఆటగాళ్లతో పాటు సిబ్బంది కరోనా బారిన పడడంతో లీగ్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. కాగా లీగ్‌లో 29 మ్యాచ్‌లు ముగియగా.. మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా టోర్నీ వాయిదా పడింది. ఈ క్రమంలోనే క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా తన ఐపీఎల్ 2021 ప్లేయింగ్ 11ను ప్రకటించాడు. ఈ సీజన్‌లో తాను మెచ్చిన ఆటగాళ్లతో ఈ జట్టును రూపొందించినట్లు చెప్పాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే.. ఆకాశ్ చోప్రా జట్టులో టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీకి కానీ, టీమిండియా ప్రస్తుత కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కానీ, టీమిండియా వైస్ కెప్టెన్, డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు కానీ తన జట్టులో కెప్టెన్సీ ఇవ్వలేదు. కెప్టెన్సీ దేవెడెరుగు.. కనీసం జట్టులో చోటు కూడా ఇవ్వలేదు. అంతేకాదు అనూహ్యంగా ఆకాశ్ తన ప్లేయింగ్ 11 కెప్టెన్ బాధ్యతలను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు అప్పగించాడు.

ఐపీఎల్ ఈ సీజన్ వాయిదా పడేవరకు ఆడిన మ్యాచ్‌లలో ఆటగాళ్లు, కెప్టెన్ల ప్రతిభ ఆధారంగా ఈ జట్టును ఎంపిక చేసినట్లు ఆకాశ్ చోప్రా చెప్పాడు. జట్టు కెప్టెన్‌గా, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా రిషబ్‌ పంత్‌ను ఆకాశ్ ఎంపిక చేశాడు. ఇక ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, శిఖర్ ధవన్‌.. మూడో స్థానంలో ఫాప్ డుప్లెసిస్‌(చెన్నై ఓపెనర్) మిడిలార్డర్‌లో గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేశాడు. అలాగే ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, క్రిస్ మోరిస్‌లను సెలెక్ట్‌ చేశాడు. మరో స్పిన్నర్‌గా రాహుల్ చాహర్‌ని తీసుకున్నాడు. ఇక పేస్ బౌలింగ్ విభాగంలో ఆవేష్ ఖాన్, హర్షల్ పటేల్‌లకు జట్టులోకి తీసుకున్నాడు.

ఆకాశ్ చోప్రా ప్లేయింగ్ 11 ఫర్ ఐపీఎల్ 2021: రిషబ్ పంత్ (వికెట్ కీపర్/ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, రవీంద్ర జడేజా, క్రిస్ మోరీస్, రాహుల్ చాహర్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్.

ఇదిలా ఉంటే ఇక క్రికెట్లో మాజీ ఆటగాళ్లు, సీనియర్లు, కామెంటేటర్లు ఇలా ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన, మెచ్చిన ఆటగాళ్లతో తమ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ జట్లను అప్పుడప్పుడూ ప్రకటిస్తుంటారు. వారి దృష్టిలో మేటి ఆటగాళ్లకు జట్టులో స్థానం కల్పిస్తుంటారు. తాఅయితే ఆ జట్టులో వరుస విజయాలతో తమ జట్లను ముందుకు తీసుకెళ్తున్న ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీలకు కానీ.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు సారథి రోహిత్ శర్మకు కానీ చోటు దక్కకపోవడం గమనార్హం.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x