Sunday, March 22, 2026

వ్యాక్సిన్‌ వేసుకోండి.. రూ.840 కోట్ల ప్రైజ్‌మనీ గెలుచుకోండి

క్యాలిఫోర్నియా ప్రజలకు అక్కడి సర్కారు భారీ ప్రైజ్‌మనీ ప్రకటించింది. కాలిఫోర్నియాలో వచ్చే నెల 15న కోవిడ్‌ ఆంక్షలు ఎత్తివేయనున్న నేఫథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో ప్రజలను ఆకర్షించేందుకే ఈ భారీ బహుమతిని ప్రకటించినట్లు రాష్ట్ర గవర్నర్‌ గవిన్‌ ప్రకటించారు. 12 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని నెలల తరబడి ప్రచారం చేసినా, ఇప్పటివరకూ 3.4 కోట్ల మంది జనాభాలో 63% మందే వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

ఈ క్రమంలోనే మిగిలిన వారికి కూడా మిగిలిన 15 రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలి డోసు అందించేందుకు ఈ ప్రైజ్‌మనీ ఆఫర్‌ను ప్రకటించారు. దీనికి కనీస అర్హతగా తొలిడోసు టీకా వేసుకుని ఉండాలని షరతు పెట్టారు. ఈ లక్కీ డ్రాకు ఇప్పటికే టీకాలు వేయించుకున్న వ్యక్తులు కూడా అర్హులని స్పష్టం చేశారు. జూన్‌ 4తో లక్కీ డ్రా ప్రారంభమవుతుంది.

మొత్తం 10 మందికి 1.5 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.10.86 కోట్లు), 30 మందికి 50,000 డాలర్లు (రూ.36.21 లక్షలు) నగదు బహుమతులతో పాటు 20 లక్షల మందికి 50 డాలర్ల(రూ.3,600) విలువైన బహుమతి కూపన్లు ఇస్తారట. ఇదే తరహాలో ఒహాయో, కొలరాడో, ఒరెగాన్‌ రాష్ట్రాలు ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించాయి. అయితే ఒకవేళ మన దేశంలో కూడా ఇలాంటి ఆఫర్లనే ప్రకటిస్తే మరి వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ఫాస్ట్ అవుతుందేమో చూడాలి.

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -