Wednesday, January 22, 2025

భారీ సంక్షోభం ముందు భారత్.. అమెరికా వైద్యుడి హెచ్చరిక!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రోజూ లక్షల కేసులు, వేల మరణాలతో దేశంలో అత్యంత దైన్య పరిస్థితి నెలకొంది. దీనికి తోడు కరోనా బాధితుల అవస్థలు ఓ వైపు ఉంటే.. మరో వైపు పేద ప్రజలపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటోంది. వారికి జీవనోపాధి కరువవుతోంది. దీనివల్ల కనీస అవసరాలు కూడా తీరక నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి తోడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు విధించడంతో వారి పరిస్థితి మరింత దైన్యంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ భవిష్యత్తుపై అనేకమంది విదేశీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే భవిష్యత్తులో భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని, జీవనోపాధి లోటును ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో జాతీయ సలహా మండలి(ఎన్‌ఏసీ) సభ్యుడిగా పనిచేసిన ప్రముఖ ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త జీన్‌ డ్రెజ్‌ భారత ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ తీవ్రమైన జీవనోపాధి సంక్షోభం ఎదుర్కొనబోతోందని, కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా శ్రామిక వర్గాలు బతుకుతెరువుకు దూరమవుతున్నారని, ఇలానే కొనసాగితే 2024-25 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తింటుందని హెచ్చరించారు. ‘దేశంలో కరోనా వల్ల కొనసాగుతున్న పరిస్థితులు ఇలానే కొనసాగితే కేంద్రం ఇంతకుముందు నిర్దేశించిన 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న ప్రభుత్వ లక్ష్యం అసాధ్యం. ఏ విధంగా చూసినా అది సాధ్యం కాదు. దీనికితోడు భారత్‌లోని సంపన్న వర్గాలను మరింత సూపర్‌ పవర్‌‌గా మార్చడానికే అది దోహదపడుతుందం’టూ జీన్ డ్రెజ్ అభిప్రాయపడ్డారు.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో పోలిస్తే, స్థానిక లాక్‌డౌన్‌లతో ఆర్థిక నష్టం తక్కువేనని, కార్మిక వర్గానికి గతేడాది కంటే గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రస్తుత సంక్షోభం దీర్ఘకాలం పాటు, బహుశా ఏళ్ల తరబడి కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదని అన్నారు. ఇక అనేక మంది తమ పొదుపు సొమ్మును ఖర్చు చేస్తున్నారని, మరి కొంతమంది భారీగా అప్పులు చేస్తున్నారని, దీనివల్ల వారి కొనుగోలు శక్తి మరింత దిగజారిపోతుందని అభిప్రాయపడుతున్నారు.

కరోనా వల్ల ఆర్థికంగా నష్టపోయిన బాధితుల కోసం గతేడాది ప్రకటించిన అనేక సహాయక చర్యలు ఈ ఏడాది మరింత పటిష్ఠంగా అమలు చేయాలి. వాటిని మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఇప్పటికే మే, జూన్‌లో ఉచిత రేషన్‌ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, అయితే దానిని మరిన్ని నెలలకు విస్తరించాలని, సమగ్ర నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని అభిప్రాయపడ్డారు.

ఇక దశాబ్దాలుగా వైద్య, ప్రజా ఆరోగ్య రంగాన్ని భారత్ నిర్లక్ష్యం చేస్తూ వచ్చిందని, ఆ నిర్లక్ష్యానికి ప్రస్తుతం మూల్యం చెల్లిస్తోందని, ప్రజారోగ్యం కోసం ఏటా ఖర్చు చేసున్న మొత్తం జీడీపీలో ఒక శాతం కన్నా తక్కువగా ఉండడమే దీనికి నిదర్శనమని జీన్ డ్రెజ్ పేర్కొన్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x