అవతార్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఎం అచ్చిబాబు సమర్పణలో.. నిర్మాత టి-కేశవ తీర్థ గారు నిర్మించిన సినిమా “ఈ కథలో నేను” బుర్రా సాయి మాధవ్ రచన చేసిన సినిమా “ఈ కథలో నేను”. ఈ సినిమాకి ఎమ్మెస్ ఫణిరాజ్ దర్శకత్వం వహించారు. లవ్ అండ్ లస్ట్..తో ఇప్పుడున్న యూత్ ట్రెండ్ కి సరిపోయే విధంగా ఉండే స్క్రిప్ట్ ని ఇచ్చినందుకు సాయి మాధవ్ గారికి దర్శకుడు ఫణి రాజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ ని ప్రముఖ దర్శకులు క్రిష్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఈ మూవీ లో ని పాటలు నచ్చి మంచి ప్రైస్ కి ఆడియో హక్కులు ఆదిత్య ఆడియో వారు సొంతం చేసుకున్నారు.
క్రిష్ గారు మాట్లాడుతూ.. సాయి మాధవ్ బుర్రా గారి రచనలో వస్తున్నటువంటి ఈ చిత్రం ఖచ్చితంగా ఈ ట్రెండ్ కి, ఇప్పటి యూత్ కి సరిపోయే విధంగా, సాయిమాధవ్ గారి రచన శైలితో కలిపి మరింత కొత్తగా ఉంటుందని, ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్లో ఉన్న డైలాగ్స్ చాలా బాగున్నాయని, ఖచ్చితంగా ఈ సినిమా డైరెక్టర్ కి, ఈ టీం కి మంచి పేరు తెస్తుందని అన్నారు.ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి.మా సాయి మాధవ్ గారికి మంచి పేరు తో పాటు మంచి విజయం సాదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చిత్ర హీరో హోమానంద్ మాట్లాడుతూ.. మా చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ గారు ట్రైలర్ లంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ చిత్రానికి సాయి మాధవ్ గారు కథ స్కిన్ పై మాటలు అందించారు
అచ్చిబాబు గారు మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ ని క్రిష్ గారు రిలీజ్ చేయటం చాల ఆనందం గా ఉంది. డైరెక్టర్ ఈ సినిమా ని మంచి చిత్రాన్ని అందిచ్చారు మాకు నిజంగా నిను హ్యాపీ గా ఉన్నాను ఈ సినిమా చూశాక మీకు తప్పక నచ్చుతుంది అని కోరుకుంటున్నాను అతి త్వరలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించడానికి మేము, టీం సిద్దమవుతున్నాం.
దర్శకుడు ఎమ్మెస్ ఫణి రాజ్ మాట్లాడుతూ.. తను అడగగానే చిన్న సినిమాని ప్రోత్సహించే విధంగా డైరెక్టర్ శ్రీ క్రిష్ గారు తన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో పాటలు రాయించుకునే అదృష్టం మా సినిమాకి నాకు దక్కిందని అన్నారు. సీతారామశాస్త్రి గారి అబ్బాయి యోగిశ్రీ దీనికి మ్యూజిక్ చేశారు.హేమచంద్ర, అనురాగ్ కులకర్ణి, ఉషా గారు పాటలు పాడారు. శ్రీ సాగర్, రెహమాన్, సాయికిరణ్ లు ఈ సినిమాకి సాహిత్యాన్ని అందించారు. హోమానంద్ -రేవంత్ హీరోలుగా, సిమ్రాన్ పరింజా హీరోయిన్ గా (తెలుగు కిరాక్ పార్టీ హీరోయిన్) నటించిన ఈ చిత్రంలో.. నరేష్ విజయ్ కృష్ణ గారు, పోసాని కృష్ణ మురళి గారు, మధునందన్, తేజస్విని, అభయ్ బేతిగంటి, ఈ రోజుల్లో సాయి, కిరీటి, రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్, శశిధర్, తదితరులు నటించారు. ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత టి-కేశవ తీర్థ గారు తెలిపారు.