Wednesday, January 22, 2025

‘అలా నిన్ను చేరి’ ప్రారంభోత్సవ కార్యక్రమం

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’ . హుషారు సినిమాతో సక్సెస్ కొట్టి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న దినేష్ తేజ్ హీరోగా.. హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో గురువారం ఘనంగా జరిగింది .

హీరో హీరోయిన్స్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మందడి కిషోర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. మాజీ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి టీవీ 5 మూర్తి, హనుమంతరావు, కృష్ణా రావు, గరుడవేగ అంజి, హుషారు ఫేమ్ తేజస్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

దర్శకత్వ బాధ్యతను మాత్రమే కాకుండా కథ, కథనం, మాటలు కూడా మారేష్ శివన్ అందించారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకానుంది.

‘అలా నిన్ను చేరి’ సినిమాకు పాటలు చంద్రబోస్, సంగీతం సుభాష్ ఆనందన్ అందిస్తుండగా.. పి.జి. వింద కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా విఠల్, క్యాస్టూమ్ డిజైనర్‌గా ముదసరా మహ్మద్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌.

ఈ చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, శివ రామచంద్రవరపు, రంగస్థలం మహేష్ తదితరులు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x